KTR | డ్రగ్స్ టెస్టులకు సిద్ధమే.. మహేశ్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్..!
KTR | మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ చేసిన సవాల్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. తాను ఎప్పుడూ డ్రగ్స్ టెస్టులకు సిద్ధమేనన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని స్పష్టం చేశారు.
KTR | మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ చేసిన సవాల్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. తాను ఎప్పుడూ డ్రగ్స్ టెస్టులకు సిద్ధమేనన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని స్పష్టం చేశారు. అన్ని పార్టీల నేతలు టెస్టులు చేసుకోవాలని చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని, అయితే, ప్రజా ప్రతినిధులు ముందుండి ఆదర్శంగా నిలబడాలని కేటీఆర్ సూచించారు. అయితే, ప్రతీసారి ప్రతి డ్రగ్స్ కేసులో తన పేరును వాడుతుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మళ్లీ తన పేరును డ్రగ్స్ కేసులో అనవసరంగా లాగితే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు మానవులను రాక్షసులను చేస్తాయని అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా మాదకద్రవ్యాల వాడకాన్ని ఆశ్రయించడం దురదృష్టకరమన్నారు. తాను వ్యక్తిగతంగా మాదకద్రవ్యాలు, నిషేధిత పదార్థాల వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీ డ్రగ్స్ వాడకాన్ని, ఏ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుందని స్పష్టం చేశారు. ఎవరైనా మాదకద్రవ్యాలను వినియోగించినా, విక్రయించినా పార్టీతో సంబంధం లేకుండా అలాంటి వ్యక్తులపై చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు.
https://twitter.com/KTRBRS/status/2033115814329749779
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



