త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Plenary Meeting | ప్లీన‌రీకి కొద్ది మందే.. కేటీఆర్ అధికారిక ప్ర‌క‌ట‌న‌

BRS Plenary Meeting | బీఆర్ఎస్ పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ ప్లీన‌రీ స‌మావేశాన్ని కేవ‌లం రాష్ట్ర కార్య‌వ‌ర్గానికే ప‌రిమితం చేసింది. ఈ మేర‌కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Apr 26, 2026, 4.29 pm IST

BRS Plenary Meeting | ప్లీన‌రీకి కొద్ది మందే.. కేటీఆర్ అధికారిక ప్ర‌క‌ట‌న‌
Advertisement

అంద‌రికి అనుమ‌తి లేదు
కేవ‌లం రాష్ట్ర కార్య‌వ‌ర్గానికే
ప్ర‌తి గ్రామంలో జెండా ఎగుర‌వేయండి
గులాబీ శ్రేణుల‌కు కేటీఆర్ పిలుపు

BRS Plenary Meeting | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ ప్లీన‌రీ స‌మావేశాన్ని కేవ‌లం రాష్ట్ర కార్య‌వ‌ర్గానికే ప‌రిమితం చేసింది. ఈ మేర‌కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్లీన‌రీని రాష్ట్ర కార్య‌వ‌ర్గానికి ప‌రిమితం చేసిన‌ప్ప‌టికీ.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

ఏప్రిల్ 27వ తేదీన‌ తెలంగాణ భవన్‌లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. ఇటీవల జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో, ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు కేటీఆర్ తెలిపారు.

ఆహ్వానం ఉన్న‌వారే రావాలి..

ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని పార్టీ స్పష్టం చేసింది. తెలంగాణ భవన్‌లో పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని, ఆహ్వానం ఉన్న వారు మాత్రమే హాజరుకావాలని, మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ కోరారు.

మ‌. 1.30 వ‌ర‌కు హైద‌రాబాద్‌కు చేరుకోండి..

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం, మండలం, పట్టణం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉదయాన్నే స్థానిక ప్రాంతాల్లో జెండా పండుగ ముగించుకుని, మధ్యాహ్నం 1:30 గంటల కల్లా హైదరాబాద్ చేరుకోవాలని దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రతినిధులకు సూచించారు.

Advertisement
Advertisement