త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మోదీజీ మీ బేటీ బచావో వట్టి నినాదమేనా..? కేంద్రమంత్రి బండి సంజయ్‌ తనయుడిపై ఫోక్సో కేసుపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్‌

KTR | కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడిపై నమోదైన ఫోక్సో కేసుపైన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. బాలిక పరిస్థితి, వారి కుటుంబంపై జరుగుతున్న వేధింపులపై ఆందోళన వ్యక్తం చేశారు.

P

Telangana | Published On May 9, 2026, 9.49 pm IST

KTR | మోదీజీ మీ బేటీ బచావో వట్టి నినాదమేనా..? కేంద్రమంత్రి బండి సంజయ్‌ తనయుడిపై ఫోక్సో కేసుపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్‌
Advertisement

KTR | కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడిపై నమోదైన ఫోక్సో కేసుపైన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. బాలిక పరిస్థితి, వారి కుటుంబంపై జరుగుతున్న వేధింపులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా? అంటూ నిలదీశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై మీరు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? అతనికి మినహాయింపు ఉంటుందా? అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ ఎప్పుడు రాజీనామా చేస్తారు ? మంత్రి వర్గం నుంచి ఎప్పుడు బర్తరఫ్‌ చేస్తారు ? నిలదీశారు.

రాహుల్ గాంధీ తెలంగాణలో మీ పార్టీ ఎలాంటి ‘జంగిల్ రాజ్’ నడుపుతోంది? ఒక మైనర్ బాలిక అన్ని ఆధారాలతో వచ్చినప్పుడు పోలీస్ శాఖ అత్యంత వేగంగా ఎందుకు స్పందించలేదు? కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఇతర పోక్సో నేరస్తుల మాదిరిగానే కేసు నమోదు చేసి ఎందుకు విచారణ జరపడం లేదు? అంటూ ప్రశించారు. మైనర్ బాలికపైనే ఎదురు కేసు ఎందుకు పెట్టారు? ఉన్నావ్ కేసులో చేసినట్లుగా, రాహుల్ గాంధీ హైదరాబాద్‌ వచ్చి బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా నిలబడతారా? లేక ఇది తెలంగాణ బాధితులకు వర్తించదా? తెలంగాణ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్రాంచైజీలా పనిచేస్తోందా? ఒక మైనర్ బాలిక గౌరవం విషయంలో కాంగ్రెస్ మరియు బిజెపి ఒక అపవిత్రమైన, అసహ్యకరమైన ఒప్పందానికి వచ్చాయా? ఘాటుగా స్పందించారు.

ఒక 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు.. ఆమె కుటుంబం, ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించుకోవడానికే మూడు నెలలకుపైగా ఎందుకు పోరాడాల్సి వస్తోంది? మనం ఎంతటి దుర్భరమైన, భయంకరమైన నరకంలో జీవిస్తున్నామో ఆ కుటుంబం కష్టం చూస్తే అర్థమవుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని నేరస్తుల్లా చూస్తూ ఎందుకు వేధిస్తున్నారు? ఆ మైనర్ బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని, న్యాయం కోసం వారు మూడు నెలలుగా తిరుగుతున్నారన్నారు. ఇప్పుడు మీరు ఆమెనే నిందిస్తున్నారా? ఏ నిబంధన ప్రకారం.. తెలంగాణ పోలీసులు ఒక మైనర్ బాలికపై హనీ-ట్రాప్, వసూళ్ల కేసు నమోదు చేశారని ప్రశ్నించారు. మన మహిళల గౌరవం కోసం గతంలో అణచివేతదారులతో, ప్రభుత్వాలతో పోరాడమని, ఆడబిడ్డల రక్షణ కోసం అవసరమైతే మరో మిలియన్ సార్లు పోరాడుతామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement