KTR vs Revanth Reddy | తాండూరు నర్సింగ్ కాలేజీని ఎత్తుకుపోయిన దొంగ రేవంత్: కేటీఆర్
చరిత్రలో బూతులు మాట్లాడే ఏకైక సీఎంగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారని కేటీఆర్ దుయ్యబట్టారు. తాండూరు నర్సింగ్ కాలేజీని ఎత్తుకుపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
KTR vs Revanth Reddy | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. అధికార కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేసుకోవడం కోసమే అన్నట్లుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పలు మున్సిపాలిటీల్లో పర్యటించారు. తాండూరు, నర్సంపేట మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించిన భారీ రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అంత చెత్త ముఖ్యమంత్రి, నీచమైన ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరూ లేరన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా పర్యటనకు వెళ్తే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతారు.. ప్రజలకు నాలుగు మంచి మాటలు చెబుతారు. కానీ చరిత్రలో బూతులు మాట్లాడే ఏకైక సీఎంగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారని కేటీఆర్ దుయ్యబట్టారు. తాండూరు నర్సింగ్ కాలేజీని ఎత్తుకుపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ను తిట్టడం తప్పించి రేవంత్ చేసిందేం లేదు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి రెండేళ్ల నుంచి కేసీఆర్‌ను తిట్టడం తప్పించి చేసింది ఏం లేదన్నారు. ప్రతి రోజూ వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆలోచించడమే రేవంత్ రెడ్డి పనన్నారు. ఈ ఎన్నికల్లో కాకుంటే కాంగ్రెస్ వాళ్లు మరో మూడు సంవత్సరాల దాకా దొరకరు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
ఆగస్టు 20, 2026

Konda Surekha TPCC Notice | కొండా సురేఖకు టీపీసీసీ బిగ్ షాక్.. కూతురు కామెంట్స్‌పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే
ఆగస్టు 19, 2026

Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



