త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు.. అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా?: కేటీఆర్‌

KTR | నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం బ్యారేజి (Annaram Barrage) పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని రేవంత్ స‌ర్కార్ (Revanth Reddy) ప్రమాదంలోకి నెడుతున్న‌ద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ (KTR) చెప్పారు. పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుంచి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు.

G

Telangana | Published On Mar 2, 2026, 1.04 pm IST

KTR | మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు.. అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా?: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం బ్యారేజి (Annaram Barrage) పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని రేవంత్ స‌ర్కార్ (Revanth Reddy) ప్రమాదంలోకి నెడుతున్న‌ద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ (KTR) చెప్పారు. పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుంచి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. ఇది క‌చ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) దెబ్బతీసే కుట్రేన‌ని మండిప‌డ్డారు. తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేన‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది.. ఖబడ్దార్ అని ఎక్స్ వేదిక‌గా హెచ్చ‌రించారు.

`మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా ??. నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం. బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్‌ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.

ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్ పై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకపర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదు. నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం బ్యారేజి పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని ప్రమాదంలోకి నెడుతుంది రేవంత్ సర్కార్.. ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రే.

పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుంచి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తుంది. తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో.. ఇవే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలన సూత్రాలు. తెలంగాణను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది.. ఖబడ్దార్.` అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

https://x.com/KTRBRS/status/2028326342539034859

 

Advertisement
Advertisement