KTR | చారిత్రక పరిశోధన ఆధారిత నవలలు రావాలి.. కేటీఆర్ పిలుపు..!|
KTR | సుసంపన్నమైన చరిత్ర కలిగిన తెలంగాణలో చారిత్రక, సామాజిక అంశాలను కొత్త దృష్టితో స్పృశించే నవలలు, ఆవిష్కరణలు మరిన్ని రావాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.
KTR | సుసంపన్నమైన చరిత్ర కలిగిన తెలంగాణలో చారిత్రక, సామాజిక అంశాలను కొత్త దృష్టితో స్పృశించే నవలలు, ఆవిష్కరణలు మరిన్ని రావాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. చెంచుల జీవనం, సంస్కృతిని ప్రతిబింబించేలా నవలను రాయటం అభినందనీయమని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి గురించి చెప్పాలో.. ఎవరి గొంతుకై నినదించాలో.. రచయిత సరిగ్గా దాన్ని అందుకున్నారని కేటీఆర్ కొనియాడారు. గురువారం నంది నగర్ లోని తన నివాసంలో ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, కోణతం దిలీప్, జర్నలిస్టు సంఘం నాయకుడు ఆస్కాని మారుతిసాగర్, జర్నలిస్టు తిరుపతి నాయక్ తదితరులు కలిసి రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు 'కొండమల్లు' నవల నూతన ఎడిషన్‌ను కేటీఆర్‌కు అందజేశారు.
తమ రాజధానిని విస్తరించుకునే ప్రయత్నంలో బ్రహ్మనాయుడు సైన్యం చెంచు నివాసాలపై దాడి చేయడాన్ని ఎదురించే ఈ కథ, చెంచు నాయకుడైన బయ్యన్న చుట్టూ తిరుగుతుంది. అధికార బలం, సైనిక బలగంతో ఉన్న బ్రహ్మనాయుడుతో నేరుగా తలపడలేక తన ప్రతీకార యాత్రలో భాగంగా "కారుకోడి" అనే ఒక ప్రత్యేక జాతి కోడిపుంజును పట్టుకుని, దానిని "కొండమల్లు"గా మారుస్తాడు. 800 ఏళ్ల పురాతన పలనాటీ సీమ చరిత్ర, చెంచుల సామాజిక అంశాలపై జరిపిన పరిశోధన ఆధారంగా ఒక నూతన దృక్కోణంతో రచించిన నవల ఇతివృత్తాన్ని గురించి ప్రజాకవి గోరటి వెంకన్న కేటీఆర్‌కు వివరించారు. తెలంగాణలోని నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, గుంటూరు, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవి, చెంచుల జీవితం, సంస్కృతి, వారి ప్రస్తుత అవసరాల గురించి కూడా కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నేపథ్యం ఉన్న చారిత్రక అంశాల మీద పరిశోధించి నవల రాయాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



