త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vikarabad | రోడ్ల అభివృద్ధికి పెద్ద‌పీట : మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

Vikarabad | వికారాబాద్ జిల్లా రోడ్ల అభివృద్ధికి రూ.900 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. తాండూర్ నియోజకవర్గంలో రూ.290 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణం, బలోపేత పనులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్యతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

P

Telangana | Published On Jul 18, 2026, 4.56 pm IST

Vikarabad | రోడ్ల అభివృద్ధికి పెద్ద‌పీట : మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి
Advertisement
  • వికారాబాద్ జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ.900కోట్లు
  • మెరుగైన ర‌హ‌దారుల‌తో అభివృద్ధి, ఉపాధి అవ‌కాశాలు
  • రవాణా వ్యవస్థ అభివృద్ధితోనే ప్రగతి సాధ్య‌మ‌న్న శ్రీ‌ధ‌ర్‌బాబు

Vikarabad | వికారాబాద్ జిల్లా రోడ్ల అభివృద్ధికి రూ.900 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. తాండూర్ నియోజకవర్గంలో రూ.290 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణం, బలోపేత పనులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్యతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కందనెల్లి జేపీఆర్ గార్డెన్‌లో జరిగిన సభలో మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. తాండూర్ నియోజకవర్గానికి రూ.290 కోట్ల నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. మెరుగైన రహదారి సౌకర్యాలతో పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. మంజూరైన పనులను త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు.

ప్రజాపాలనలో భాగంగా గత 30 నెలల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రూ.500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని, రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే రూ.900 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు యంగ్ ఇండియా పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోర్టు కేసు పరిష్కారం కాగానే రూ.94 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను 18 వారాల్లో ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

రవాణా వ్యవస్థ అభివృద్ధితోనే ప్రగతి

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. తాండూర్ ప్రాంతంలో రూ.261 కోట్ల వ్యయంతో ప్రధాన రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. రవాణా వ్యవస్థ మెరుగుపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్న మంత్రి.. కాగ్నా నదిలో మురుగునీరు కలవకుండా రూ.30 కోట్లతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేశామని, గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షల ద్వారా 70 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందిస్తున్నామని, తాండూర్ మున్సిపాలిటీ పరిధిలో 571 మంది అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను పారదర్శకంగా కేటాయించామని తెలిపారు. అంతర్గత మురుగు కాలువల సమస్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తే అనుమతులు ఇస్తామని చెప్పారు.

Advertisement
Advertisement