త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KKR | ఈసారి కూడా కేకేఆర్ కెప్టెన్సీ బాధ్య‌లు మ‌ళ్లీ అజింక్య ర‌హానేకే..!

KKR | మూడుసార్లు చాంపియ‌న్‌గా నిలిచిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సీజన్‌లో జట్టు ప‌గ్గాలు ఎవ‌రికి ఇస్తార‌న్న చ‌ర్చ సాగుతోంది. అయితే, యాజ‌మాన్యం అజింక్య ర‌హానే వైపు మొగ్గు చూపుతున్న‌ట్లుగా స‌మాచారం.

P

Telangana | Published On Mar 15, 2026, 7.54 pm IST

KKR | ఈసారి కూడా కేకేఆర్ కెప్టెన్సీ బాధ్య‌లు మ‌ళ్లీ అజింక్య ర‌హానేకే..!
Advertisement

KKR | మూడుసార్లు చాంపియ‌న్‌గా నిలిచిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సీజన్‌లో జట్టు ప‌గ్గాలు ఎవ‌రికి ఇస్తార‌న్న చ‌ర్చ సాగుతోంది. అయితే, యాజ‌మాన్యం అజింక్య ర‌హానే వైపు మొగ్గు చూపుతున్న‌ట్లుగా స‌మాచారం. ర‌హానే గతంలో శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కేకేఆర్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన విష‌యం తెలిసిందే. షారుఖ్ ఖాన్, కేకేఆర్ మేనేజ్‌మెంట్ ర‌హానేను కెప్టెన్‌గా కొన‌సాగించాల‌ని భావిస్తోంది. జ‌ట్టును ముందుండి న‌డిపిస్తాడ‌ని భావిస్తోంది. అయితే, గ‌త సీజ‌న్‌లో కేకేఆర్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ర‌హానే నేతృత్వంలో 13 మ్యాచులు ఆడిన జ‌ట్టు కేవ‌లం ఐదుమ్యాచుల్లో మాత్ర‌మే గెలిచింది. ర‌హానే బ్యాటింగ్‌లో స‌త్తాచాటి కేకేఆర్ త‌ర‌ఫున టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

ఈ సీజ‌న్‌లోనూ ర‌హానే మూడో నంబ‌ర్‌లో బ్యాటింగ్ చేయ‌నున్నాడు. అయితే, ఈ సీజన్‌లో ఎవరు ఓపెనింగ్‌ చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. కేకేఆర్ కొత్త‌గా న్యూజిలాండ్ ప్లేయ‌ర్లు ఫిన్ అలెన్‌, టిమ్ స్టిఫెర్ట్, ర‌చిన్ ర‌వీంద్ర కొనుగోలు చేసింది. అలాగే, ఆస్ట్రేలియ‌న్ ఆల్‌రౌండ‌ర్ కామెరున్ గ్రీన్‌ను జ‌ట్టులో చేరుకుంది. కేకేఆర్ స్టార్ స్పిన్న‌ర్ సునీల్ న‌రైన్ జ‌ట్టులో ఉన్నాడు. ఈ ఆల్‌రౌండ‌ర్ బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ రాణించాడు. ఈ సీజ‌న్‌లో కేకేఆర్ తొలి మ్యాచ్ మార్చి 29న ముంబ‌యి ఇండియ‌న్స్‌తో త‌ల‌ప‌డ‌నున్న‌ది. అయితే, ఫాస్ట్ బౌల‌ర్ హ‌ర్షిత్ రాణా గాయం కార‌ణంగా కేకేఆర్ ఆందోళ‌న‌కు గుర‌వుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయం కావ‌డంతో ఫిట్‌నెస్ సాధించ‌లేక‌పోయాడు. దాంతో టోర్నీలో ఆడ‌డం అనిశ్చితి నెల‌కొంది. హర్షిత్ గాయాన్ని పూర్ణంగా కోలుకోవడానికి రీహాబ్ అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్నారు.

Advertisement
Advertisement