త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP Anand | ఇలాగే ముందుకు సాగండి.. అవార్డు పొందిన‌ ఈగ‌ల్ ఫోర్స్ టీమ్‌కు డీజీపీ అభినంద‌న‌లు

DGP Anand | సందీప్ శాండిల్య నాయకత్వంలో ఈగ‌ల్ (EAGLE) ఫోర్స్ దేశంలోనే అత్యుత్తమ Anti-Narcotics Task Force (ANTF)గా అవార్డు పొందడం గర్వకారణమని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

S

Telangana | Published On Sep 22, 2026, 5.03 pm IST

DGP Anand | ఇలాగే ముందుకు సాగండి.. అవార్డు పొందిన‌ ఈగ‌ల్ ఫోర్స్ టీమ్‌కు డీజీపీ అభినంద‌న‌లు
Advertisement

DGP Anand | త్రినేత్ర న్యూస్‌: సందీప్ శాండిల్య నాయకత్వంలో ఈగ‌ల్ (EAGLE) ఫోర్స్ దేశంలోనే అత్యుత్తమ Anti-Narcotics Task Force (ANTF)గా అవార్డు పొందడం గర్వకారణమని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 3వ జాతీయ ANTF చీఫ్స్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం తెలంగాణ పోలీసుల మరో ఘనత అని కొనియాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సమావేశంలో 2026-29 నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్‌ను సమర్థవంతంగా అమలు చేయడం, నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం, డ్రగ్-ఫ్రీ #India కోసం సమష్టిగా పనిచేయడం వంటి అంశాలపై చర్చ జరుగుతోందని తెలిపారు. సింథటిక్ డ్రగ్స్, క్లాండెస్టైన్ ల్యాబ్స్‌పై చర్యలు, డ్రగ్ ముఠాలను ఛేదించడం, డార్క్‌నెట్, క్రిప్టో ద్వారా జరుగుతున్న డ్రగ్ నేరాలపై దర్యాప్తును బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

సైబర్ క్రైమ్ పనితీరు, యాంటీ-నార్కోటిక్స్ పనితీరు అనే రెండు ప్రధాన ప్రాధాన్య రంగాల్లో తెలంగాణ పోలీస్ దేశంలో అగ్రస్థానానికి చేరుకోవడం గర్వకారణమన్నారు. జాతీయ క్రిమినల్ చట్టాల అమలు, ICJS, CCTNS వంటి ఇతర రంగాల్లో కూడా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి, మరింత దృష్టి పెట్టి పనితీరును మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే ఈ రంగాల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇది మొత్తం తెలంగాణ పోలీస్ ఫోర్స్‌కు గర్వకారణమైన విజయమని, ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలని పోలీస్ సిబ్బందికి పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement