KCR | ఎర్రవల్లి నుంచి బయల్దేరిన కేసీఆర్.. నందినగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు
KCR | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రవల్లి నుంచి ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు. మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో విచారించనున్నారు.
త్రినేత్ర.న్యూస్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రవల్లి నుంచి ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు. మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో విచారించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇప్పటికే నందినగర్ చేరుకున్నారు.
కేసీఆర్ విచారణ దృష్ట్యా నందినగర్ పరిసారల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లు పెట్టి ఎవరినీ లోపలికి అనుతించటం లేదు. కేసీఆర్ నివాసంలోకి కుటుంబ సభ్యులు, సిట్ అధికారులకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. వాహనాలను దారిమళ్లిస్తున్నారు.
ఈ ప్రాంతాల్లోనే వాహనాల నిలిపివేత..
1. నందినగర్ బస్టాప్
2. నంది నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్
3. జేసీ రెడ్డి చికెన్ సెంటర్
4. యూనియన్ బ్యాంక్ బై లేన్
5. బసవతారకం రోటరీ
6. అగ్రసేన్ జంక్షన్
7. టీఎస్ స్టడీ సర్కిల్
8. ఎన్టీఆర్ భవన్
9. ఎమ్మార్సీ కమాన్, రోడ్ నంబర్ 12
10. సాగర్ సొసైటీ టీ జంక్షన్
కాగా, కేసీఆర్‌కు సిట్ నోటీసులు, విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని గ్రామాల్లో దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని నేతలను పార్టీ నాయకత్వం ఆదేశించింది. మున్సిపాలిటీలు, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని, నల్లజెండాలతో నిరసన ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని పిలుపునిచ్చింది.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



