TRS Party | సాక్షాత్తు.. ఎన్నికల సంఘమే ఆమె ఇంటికి వెళ్లిందట.. ఎందుకో తెలుసా..?
TRS Party | తెలంగాణను సాధించిపెట్టిన టీఆర్ఎస్( TRS ) అనే మూడక్షరాల పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో( Telangana Politics ) తీవ్ర చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్( BRS )గా మారిన గులాబీ దళం.. తిరిగి టీఆర్ఎస్ పేరుతో జనంలోకి వెళ్లాలనే పునరాలోచనలో ఉండగా.. మరో రెండు పార్టీలు మాత్రం ఆ పేరు తమదేనని ప్రకటించుకుంటున్నాయి.
ఎన్నికల సంఘమే ఇంటికి వచ్చింది
టీఆర్ఎస్ మీదే అంటూ పత్రాలు ఇచ్చింది
టీఆర్ఎస్‌ను తమకే కేటాయించినట్టు ప్రకటన
కవిత టీం పబ్లిక్ స్టంట్
తెలంగాణ రక్షణ సేన పేరుతో అభ్యంతరాలను స్వీకరించాలంటూ
ఈసీ స్పీడ్ పోస్టులో జవాబు
అన్నీ పరిశీలించాకే..
నెల తర్వాత నిర్ణయం
ఈసీ స్పష్టం
TRS Party | త్రినేత్ర.న్యూస్: తెలంగాణను సాధించిపెట్టిన టీఆర్ఎస్( TRS ) అనే మూడక్షరాల పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో( Telangana Politics ) తీవ్ర చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్( BRS )గా మారిన గులాబీ దళం.. తిరిగి టీఆర్ఎస్ పేరుతో జనంలోకి వెళ్లాలనే పునరాలోచనలో ఉండగా.. మరో రెండు పార్టీలు మాత్రం ఆ పేరు తమదేనని ప్రకటించుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సేన అలియాస్ టీఆర్ఎస్ పేరుతో తాము పార్టీ పెడుతున్నామని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత( Kavitha ) ప్రకటించగా.. అలా ప్రకటించుకునేందుకు వీలు లేదని తెలంగాణ రాజ్య సమితి పార్టీ అధ్యక్షుడు తుపాకుల బాలరంగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. మరోమారు తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది.
తెలంగాణ రాష్ట్ర సేన..పేరే లేదు
ఏప్రిల్ 25న మునీరాబాద్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సదస్సులో కవిత తమ పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన అలియాస్ టీఆర్ఎస్‌గా ప్రకటించారు. కాగా పార్టీ పేరు కోసం ఏప్రిల్ 23నే అంటే.. సదస్సుకు రెండు రోజుల ముందే తొలి అడుగు వేశారు. తమ పార్టీ కోసం 5 పేర్లను ప్రతిపాదిస్తూ ఈసీకి లేఖ రాశారు. ఆ ప్రతిపాదిత పేర్లలో అసలు తెలంగాణ రాష్ట్ర సేన.. అనే పేరు లేదు. కానీ ఆవిర్భావ ప్రకటనలో మాత్రం.. ఆ పేరును ప్రకటించారు.

ఈసీయే మా ఇంటికొచ్చింది
ఏప్రిల్ 23న కవిత రాసిన లేఖకు ఏప్రిల్ 28న ఈసీ స్పీడు పోస్టులో తిరుగు జవాబు పంపింది. ఈ మేరకు.. ప్రతిపాదిత పేర్లలో మూడో పేరైన తెలంగాణ రక్షణ సేన పేరుతో నమోదు ప్రక్రియను ప్రారంభించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈపేరును రాజకీయ పార్టీగా నమోదు చేసుకునేందుకు వార్తా పత్రికలలో పబ్లిక్ నోటీస్ ప్రచురించాల్సి ఉంటుందని పేర్కొన్నది. ఆ నోటీసుకు స్పందించిన రాజకీయ పార్టీలు, ప్రజలు పంపించిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరమే రాజకీయ పార్టీ పేరుకు తుది ఆమోదం లభిస్తుందని వివరించింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అవసరమైన అన్ని పత్రాలు సమర్పించకపోతే దరఖాస్తును పరిగణించబోమని స్పష్టం చేసింది.
పార్టీ పేరు నమోదుకు అవసరమైన అన్ని పత్రాలు,వివరాలు 30 రోజుల్లోగా తమకు అందకపోతే పార్టీ నమోదు ప్రక్రియ రద్దైపోతుందని తెలిపింది. ఇందులో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదని స్పష్టం చేసింది. అయితే స్పీడు పోస్టు ద్వారా అందిన ఈ లేఖను సోషల్ మీడియాలో ఉంచిన కవిత టీం.. ఈ పేరుకు అంగీకరిస్తూ సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల సంఘమే కవిత ఇంటికి వచ్చి పత్రాలు ఇచ్చి వెళ్లిందని ఊదరగొట్టడం హాస్యాస్పదమైంది.
తీవ్ర విమర్శలు
కాగా, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులే వచ్చి బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో సంబంధిత లేఖను అందజేశారంటూ వచ్చిన వార్తలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. పార్టీ పేరును రిజిస్టర్ చేసే ప్రక్రియకు మాత్రమే ఈసీ ప్రాథమికంగా ఆమోదం తెలిపిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఈసీ తన ఉత్తర ప్రత్యుత్తరాలను పోస్ట్ ద్వారా మాత్రమే చేస్తారని, అధికారులు స్వయంగా కవితకు లేఖ ఎలా అందించారో అని వ్యంగ్య పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి .. బీఆర్ఎస్‌గా మారిన సందర్భంలో కూడా కేవలం ఈసీ నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలే తప్ప.. ఇంటికే వచ్చి లేఖలు ఇచ్చిన సందర్భాలు జరగలేదని కూడా తమ పోస్టులలో గుర్తు చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

MP Vaddiraju | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : ఎంపీ వద్దిరాజు
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



