Kavita | కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే తప్పేంటి..? .. ఫోన్ ట్యాపింగ్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు
Kavita | ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణను వీలైనంత త్వరగా ముగించాలని డిమాండ్ చేశారు.
Kavita | ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణను వీలైనంత త్వరగా ముగించాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణకు పిలవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా కవిత స్పందించారు. ఈ మేరకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచారణకు పిలవడం తప్పనట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వ హయాంలోనే జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి.. అప్పటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌ను విచారణకు పిలిచారని అన్నారు. విచారణకు పిలిస్తే ఎవరైనా పోవాల్సిందేనన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని వ్యాఖ్యానించారు. సిట్ పిలిస్తే తాను కూడా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారంటూ కవిత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు..
తెలంగాణ జాగృతి కార్యాలయంలో సోమవారం మీడియాతో కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎవరు నిలబడ్డా కారు గుర్తుకే ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారని ప్రస్తావించారు. అంటే చెడ్డ వాళ్లకి ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా..? అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం..
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కూడా కవిత స్పందించారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడుల పేరుతో ఫేక్ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుంటోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ వెళ్లి ఎన్ని ఏంఓయూలు చేసుకున్నారని నిలదీశారు. ఫేక్ ఏంఓయూలపై జాగృతి పోరాటం చేస్తుందని కవిత పేర్కొన్నారు.
ఇక హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. గంజాయి ముఠా వరుస దాడులకు పాల్పడుతున్నా.. రేవంత్ సర్కార్ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ ఫీజు సొంత డబ్బుతో కట్టుకున్నారా..? లేక ప్రభుత్వ సొమ్ముతో కట్టారా..? అని కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రజలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



