KTR Karimnagar Speech | ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయితదో ఆయనే కేసీఆర్
కరీంనగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ 1.6 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- బీఆర్ఎస్ హయాంలో లక్షా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని, అది అబద్ధమని నిరూపిస్తే కరీంనగర్ గడ్డపైనే తాను రాజీనామా చేస్తానని సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
- మూడు తరాల తెలంగాణ ప్రజలను ముంచిన ముసలి నక్క కాంగ్రెస్ పార్టీయే అని, 1956 నుంచి 2014 వరకు ఆ పార్టీ చేసిన ద్రోహాన్ని ఎండగట్టిన కేటీఆర్
- కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో జాబ్స్ లేవని, 100 రోజుల్లో అమలు చేస్తామన్న 24 హామీలు ఏమయ్యాయని నిలదీత
- 'అతడు' సినిమాలో మహేష్ బాబు చేతిలో బ్రహ్మానందం దెబ్బలు తిన్నట్లు.. కేసీఆర్‌తో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని ఎద్దేవా
- కరీంనగర్ గడ్డపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR Karimnagar Speech | త్రినేత్ర.న్యూస్ : కరీంనగర్ (Karimnagar) వేదికగా నిర్వహించిన జెన్ జీ (Gen Z) సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి వంద రోజుల పాలన అని చెప్పి వెయ్యి రోజుల పాటు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలపై ఓపెన్ ఛాలెంజ్ (Open challenge) విసరడంతో పాటు, మహేష్ బాబు సినిమా డైలాగ్స్ తో రేవంత్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఉద్యోగాలపై దమ్ముంటే నిరూపించు..
తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో 2,32,308 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు (Notifications) ఇచ్చి, 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు. "నేను చెప్పింది అబద్ధమని దమ్ముంటే రేవంత్ రెడ్డి నిరూపించాలి. నిరూపిస్తే ఇదే కరీంనగర్ గడ్డ మీద రాజీనామా (Resignation) చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా" అని కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఇచ్చిన 70 వేల ఉద్యోగాలకు కాంగ్రెస్ నాయకులు అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చి క్రెడిట్ చోరీ చేస్తున్నారని, ఇందుకు వారికి సిగ్గనిపించడం లేదా అని నిలదీశారు.
మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు.. కాంగ్రెస్ క్యాలెండర్ లో జాబ్స్ ఉండవు
ఎన్నికలకు ముందు యూత్ డిక్లరేషన్‌లో (Youth Declaration) ఇచ్చిన 24 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చి నవంబర్ 30న ఓటెయ్యండి.. డిసెంబర్ 4 లోపల 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారని గుర్తుచేశారు. "మైసూర్ బజ్జీలో మైసూర్ ఎలాగైతే ఉండదో.. వీళ్ల జాబ్ క్యాలెండర్ లో (Job calendar) కూడా జాబ్స్ ఉండవు" అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు బకాసురులు, కుంభకర్ణుల్లా పందికొక్కుల్లా తింటూ పడుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు.
కాంగ్రెస్.. మూడు తరాలను ముంచిన ముసలి నక్క
తెలంగాణను మూడు తరాల పాటు ముంచిన ముసలి నక్క కాంగ్రెస్ పార్టీయే అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1956లో ఆంధ్రా, తెలంగాణల మధ్య ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసిందని, 1968లో 370 మందిని కాల్చి చంపిందని గుర్తు చేశారు. 1971లో ప్రజలు గెలిపించిన 11 మంది ఎంపీలను గుంజుకుని కాంగ్రెస్‌లో కలుపుకుందని విమర్శించారు. 2004లో సోనియా గాంధీ మాట ఇచ్చి పదేళ్లు సతాయించిందని, శ్రీకాంతాచారి లాంటి వందల మంది త్యాగాలు, కేసీఆర్ నిరాహార దీక్ష దెబ్బకే ఆ ముసలి నక్క దిగివచ్చి తెలంగాణ ఇచ్చిందని స్పష్టం చేశారు.
బ్రహ్మానందంకి పట్టిన గతే పడుతుంది
కేసీఆర్‌ను రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు తీట మాటలు మాట్లాడుతున్నారని, 420 హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ వాళ్లే 420 సార్లు రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. "మహేష్ బాబు (Mahesh Babu) సినిమాలో బ్రహ్మానందం 4 రోజులు ఎక్సర్‌సైజ్ చేసి 'హిట్ మీ యార్' అనగానే.. మహేష్ బాబు గట్టిగా ఒక్క గుద్దు గుద్దితే కిందపడి పేస్ట్ కారుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌తో పెట్టుకుంటే గదే రిపీట్ అవుతుంది" అని సెటైర్ వేశారు. ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో ఆయనే కేసీఆర్ అని, 2006 కరీంనగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఈపు పగిలిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు వస్తాయి..
కేవలం మంత్రి కొండా సురేఖను మాత్రమే కాకుండా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ (Dismiss) చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేటీఆర్ హెచ్చరించారు. పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీని కూడా త్వరలోనే ప్రజలు నిషేధిత జాబితాలో పెట్టడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ట్రాప్ లో పడొద్దని యువతకు పిలుపునిచ్చారు.
మూడు తరాలను తెలంగాణలో ముంచిన ముసలి నక్క కాంగ్రెస్
1956లో తెలంగాణకు, ఆంధ్రకు ఇష్టంలేని బలవంతపు పెళ్లి చేసింది ఈ ముసలి నక్కే
1968లో 370 మందిని కాల్చి చంపిన ముసలి నక్క కాంగ్రెస్
1971లో 11 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే, వాళ్లను గుంజుకొని పోయి కాంగ్రెస్‌లో… pic.twitter.com/ACt1GFNK5O
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2026
అతడు సినిమాలో బ్రహ్మానందం నాలుగు రోజులు ఎక్సర్‌సైజ్ చేసి నాకు బాగా బలం వచ్చిందని చెప్పి మహేష్ బాబుని హిట్ మీ యార్, హిట్ మీ అని అంటాడు
మహేష్ బాబు గట్టిగా గుద్దితే బ్రహ్మానందం కిందికెళ్ళి పేస్ట్ కారుతుంది
కేసీఆర్‌తో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గతి కూడా అదే అవుతుంది
- కేటీఆర్ pic.twitter.com/1Pnc2drq6Y
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2026
యూత్ డిక్లరేషన్‌లో 24 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు
100 రోజుల్లో అమలు చేస్తామని అన్నారు.. 1000 రోజులు అయింది
బకాసురులులాగా తింటున్నారు, కుంభకర్ణుల్లా పండుకుంటున్నారు, పంది కొక్కుల్లా తింటున్నారు.. అది తప్ప కాంగ్రెస్ వాళ్లు చేసింది ఏమీ లేదు
మళ్లీ కేసీఆర్ రాజీనామా చేయాలని… pic.twitter.com/fkoXm3bapf
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2026
ఉద్యోగాల పై రేవంత్‌కు కేటీఆర్ సవాల్.. అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తా..!
తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 2,32,308 ఉద్యోగాల నియామకాలు చేపట్టి, 1,80,083 ఉద్యోగాలు భర్తీ చేసిందని, కేటీఆర్ చెప్పింది అబద్ధమని రేవంత్ రెడ్డి నిరూపిస్తే కరీంనగర్ గడ్డపై రాజీనామా చేసి రాజకీయాల… https://t.co/N0z6UJI5aj pic.twitter.com/pwhKxbborQ
— iNews Telugu (@inewstelugu) September 5, 2026
మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు.. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌లో జాబ్స్ ఉండవు - కేటీఆర్.
మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌లో జాబ్స్ ఉండవు అంటూ, 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఖర్చు చేసి ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిందని బీఆర్ఎస్… https://t.co/VBSAzuneeB pic.twitter.com/fjhgN1bSf0
— iNews Telugu (@inewstelugu) September 5, 2026
కొండా సురేఖ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయ - కేటీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్..! కేటీఆర్ సంచలన కామెంట్స్.
మంత్రి కొండా సురేఖను కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, పేదల భూములను నిషేధిత… https://t.co/mi75n18AFn pic.twitter.com/cNUq7muYVv
— iNews Telugu (@inewstelugu) September 5, 2026
కేసీఆర్ కాదు.. హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - కేటీఆర్.
తెలంగాణను సాధించిన కేసీఆర్ రాజీనామా చేయాలని మాట్లాడటం సరికాదని, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి.. వెయ్యి రోజులు గడిచినా అమలు చేయని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… pic.twitter.com/qFZET9bn6L
— iNews Telugu (@inewstelugu) September 5, 2026
మల్ల పుడుతామా ఏందీ?
మర్లపడాలే... గట్టిగా కొట్లాడాలే!నిరుద్యోగులు నిప్పుకణికలై మండాలి..
కాంగ్రెస్ పార్టీ కాలి బూడిదయ్యే దాకా ఎంబడి పడాలె!- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ✊🔥 pic.twitter.com/kdXJvaGkME
— BRS Party (@BRSparty) September 5, 2026
1000 రోజుల్లో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు..
కానీ నోటికొచ్చిన లెక్కలు చెప్తున్నరు ఈ కాంగ్రెస్ సన్నాసులు!- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥 pic.twitter.com/XGDf41nrOn
— BRS Party (@BRSparty) September 5, 2026
రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చి బిర్యానీ తిని, ఇరానీ చాయ్ తాగి యువతకు ఎన్నో హామీలు ఇచ్చిండు.
ఎక్కడికి పోయింది నువ్విచ్చిన సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాల హామీ?ఇవాళ జాబ్ నోటిఫికేషన్లు ఎక్కడని అడిగితే.. ఎండ్రిన్ తాగి చనిపోండని, నువ్వు సీల్డ్ కవర్లో పంపిన సీఎం అంటున్నాడు… pic.twitter.com/D22SxD88pC
— BRS Party (@BRSparty) September 5, 2026
ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మి
ఎన్నికలప్పుడు దండాలు పెట్టి ఓట్లు వేయించిన
నిరుద్యోగులే రేపు కాంగ్రెస్ కు పిండం పెడ్తరు!- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥 pic.twitter.com/QJcKPlWnIt
— BRS Party (@BRSparty) September 5, 2026
కరీంనగర్ యువ సమరభేరి సభకు చేరుకున్న
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥 pic.twitter.com/WwHoqrMyGJ— BRS Party (@BRSparty) September 5, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao vs Revanth Reddy | కాంగ్రెస్ 1000 రోజుల పాలన మొత్తం సెటిల్మెంట్లే.. దమ్ముంటే కౌడిపల్లికి రా..!
సెప్టెంబర్ 3, 2026

KTR | సెప్టెంబర్ 7న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తాం
సెప్టెంబర్ 2, 2026

Chanakya Strategies Report Telangana | కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి.. వచ్చేది బీఆర్ఎస్సే
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●కేంద్రం కొత్త జీడీపీ లెక్కలు.. 7.8% వృద్ధి వెనుక ₹6.05 లక్షల కోట్ల ట్విస్ట్!
- ●Bhagyashri Borse | రష్యా, ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో మలయాళం మూవీ - హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే
- ●Harish Rao Dubbaka Speech | కాంగ్రెస్ తెచ్చిన కరువే ఇది.. రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి
- ●IPO | ఈ వారంలో 11 ఐపీవోలు.. రూ.7వేల కోట్లకు ఇష్యూలు..
- ●Uniforms | డెంగీ భయం.. బాలికలు స్కర్ట్స్ ధరించొద్దన్న మంత్రి
- ●AstraZeneca | ఆస్ట్రాజెనెకా భారీ విజయం.. కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి..

కేంద్రం కొత్త జీడీపీ లెక్కలు.. 7.8% వృద్ధి వెనుక ₹6.05 లక్షల కోట్ల ట్విస్ట్!

Bhagyashri Borse | రష్యా, ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో మలయాళం మూవీ - హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే

Harish Rao Dubbaka Speech | కాంగ్రెస్ తెచ్చిన కరువే ఇది.. రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి

IPO | ఈ వారంలో 11 ఐపీవోలు.. రూ.7వేల కోట్లకు ఇష్యూలు..



