Harish Rao vs Revanth Reddy | కాంగ్రెస్ 1000 రోజుల పాలన మొత్తం సెటిల్మెంట్లే.. దమ్ముంటే కౌడిపల్లికి రా..!
కాంగ్రెస్ 1000 రోజుల పాలన మొత్తం కుట్రలు, సెటిల్మెంట్లకే పరిమితమైందని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రుణమాఫీపై దమ్ముంటే కౌడిపల్లికి రావాలని సీఎంకు సవాల్ విసిరారు.
- ఎన్నికల హామీలు గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌడిపల్లి వేదికగా మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు
- రైతుబంధు, రైతుబీమా బంద్ చేసి సుమారు రూ.29 వేల కోట్లు లూటీ చేశారని సీఎం రేవంత్‌పై ఫైర్
- కౌడిపల్లిలో రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సీఎంకు సవాల్
- రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టిన కాంగ్రెస్‌ను.. ప్రజలు ఓడించడం ఖాయమని ధీమా
Harish Rao vs Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు దాటుతున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను (6 Guarantees) అమలు చేయకుండా మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భారీ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సర్కార్ వైఫల్యాలను, మాటల గారడీని ఆయన ప్రజల ముందు ఎండగట్టారు.
గ్యారెంటీలు గాలికి.. రైతుబీమా బంద్
ఎన్నికలకు ముందు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చిన హామీలు ఏమయ్యాయని హరీశ్ నిలదీశారు. రూ.4000 పెన్షన్, మహాలక్ష్మి స్కీమ్ కింద నెలకు రూ.2500, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు.. ఇలా ప్రతి హామీని అటకెక్కించారన్నారు. కేసీఆర్ హయాంలో అద్భుతంగా అమలైన రైతుబంధు (Rythu Bandhu), రైతుబీమా పథకాలను బంద్ చేసి ఏకంగా రూ.29 వేల కోట్లను రేవంత్ ప్రభుత్వం లూటీ చేసిందని ఆరోపించారు. ప్రీమియం కట్టకపోవడం వల్లే ఆగస్టు 13 నుంచి రైతుబీమా ఆగిపోయిందన్నారు.

సీఎంకు ఓపెన్ ఛాలెంజ్
రుణమాఫీ (Loan Waiver) పేరుతో కాంగ్రెస్ సర్కార్ పచ్చి అబద్ధాలు ఆడుతోందన్నారు. "పోలీసులు లేకుండా సీఎం రేవంత్ కౌడిపల్లికి రావాలి. ఇక్కడ అందరికీ రుణమాఫీ జరిగిందని తేలితే నేను రాజీనామా చేస్తా. మాఫీ కాలేదని తేలితే నువ్వు సీఎం పదవికి రిజైన్ చేస్తావా?" అని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రానికి 10 గంటల కరెంట్ కూడా దొరకడం లేదని, డీఏపీ (DAP), యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంట్ ఉండేదని గుర్తుచేశారు.

ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్.. ఇదో క్రిమినల్ వేస్ట్ సర్కార్
ఉమ్మడి మెదక్ జిల్లాపై కక్ష కట్టినట్లు సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేశారని విమర్శించారు. కాళేశ్వరం మోటార్లపై డ్రామాలు ఆడుతూ.. రంగనాయక, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులను డెడ్ స్టోరేజీకి (Dead Storage) తీసుకొచ్చారన్నారు. బసవేశ్వర, సంగమేశ్వర కాలువ పనులు ఆపేశారని మండిపడ్డారు. మరోవైపు ఉద్యోగాలు అడిగితే నిరుద్యోగులను ఎండ్రిన్ తాగమంటున్నారని, ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటున్నారని ఫైర్ అయ్యారు. నిజానికి ఈ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డే ఓ పెద్ద 'క్రిమినల్ వేస్ట్' (Criminal waste) అంటూ సెటైర్లు వేశారు.

పీఏసీఎస్ (PACS) స్కామ్‌పై ఎంక్వైరీ చేయాలి
కౌడిపల్లి, మహమ్మద్ నగర్ పీఏసీఎస్‌లలో ధాన్యం కొనకుండానే కాంగ్రెస్ నేతలు ఏకంగా కోటి రూపాయలు స్వాహా చేశారని హరీశ్ ఆరోపించారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కౌడిపల్లిలో 200 ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాల రైతుల భూములను 22A నిషేధిత జాబితాలో (Prohibited list) పెట్టి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 1000 రోజుల్లో 77 సార్లు ఢిల్లీకి పోయి ఫ్లైట్ టికెట్లు దండగ చేసుకోవడం తప్ప సీఎం సాధించిందేమీ లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు నిషేధిత జాబితాలో వేయడం ఖాయమని హరీశ్ రావు స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు




