SI Chandrasekhar | అత్తగారింట్లో ఉరివేసుకున్న కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ చంద్రశేఖర్.. ఐదు రోజుల క్రితం భార్య కూడా..
SI Chandrasekhar | కరీంనగర్ (Karimnagar) టూటౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ (SI Chandrasekhar) బలవన్మరణం చెందారు. భార్య మృతితో మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ జమ్మికుంట మండలం సీతంపేటలోని తన అత్తగారింట్లో ఉరివేసుకున్నారు.
SI Chandrasekhar | త్రినేత్ర.న్యూస్: కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ (SI Chandrasekhar) బలవన్మరణం చెందారు. భార్య మృతితో మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ జమ్మికుంట మండలం సీతంపేటలోని తన అత్తగారింట్లో ఉరివేసుకున్నారు. ఎస్ఐ భార్య దివ్య ఐదురోజుల క్రితం గన్నేరుపప్పు తిని ఆత్మహత్య చేసుకున్నది. ఆమె మృతికి భర్తే కారణమని మృతురాలి బంధువులు దాడికి యత్నించారు. గ్రామస్థులు, బంధువుల నిరసనల మధ్యే అంత్యక్రియలు పూర్తిచేశారు.
కాగా, 2016లో ఎస్ఐ చంద్రశేఖర్, కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్యకు వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజు మాదిరిగానే గత మంగళవారం (మార్చి 17న) కూడా చంద్రశేఖర్.. ఇద్దరు పిల్లలను పాఠశాలలో వదిలి డ్యూటీకి వెళ్లారు. కాగా దివ్య కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నది. ఈ క్రమంలో అదేరోజు ఉదయం గన్నేరుపూలు, ఆకులు మిక్సీ చేసుకొని తాగిన దివ్య.. తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పింది. విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌లోని హాస్పిటల్‌కి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందింది.
అయితే, దివ్య ఆత్మహత్యకు భర్త చంద్రశేఖర్ కారణమంటూ మృతురాలి బంధువులు దాడికి ప్రయత్నించారు. గ్రామస్తులు, బంధువుల నిరసనల మధ్య మృతురాలి తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, ఐదు రోజుల కార్యక్రమానికి శనివారం (మార్చి 21) అత్తగారింటికి వచ్చిన ఎస్‌ఐ చంద్రశేఖర్.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గదిలో నుండి బయటికి రాకపోవడంతో అనుమానంతో చూడగా ఉరి వేసుకొని ఉండటంతో జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం

Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?






