త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karimnagar | సైబ‌ర్ మోసాల‌పై ఉక్కుపాదం.. 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు..!

P

Telangana | Published On Mar 27, 2026, 9.35 pm IST

Karimnagar | సైబ‌ర్ మోసాల‌పై ఉక్కుపాదం.. 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు..!
Advertisement

Karimnagar | మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా సైబర్ మోసాలకు సహకరిస్తున్న నెట్‌వర్క్‌పై కరీంనగర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. “ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0” పేరుతో జ‌రిపిన దాడుల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మొత్తం 24 మంది నిందితులను గుర్తించ‌గా, అందులో 13 మందిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ద్వారా సుమారు రూ.138 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రత్నాకర్ బ్యాంక్ (RBL)తో పాటు వర్చువల్ ఖాతాల ద్వారా జరిగిన మోసాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 112, 318(4)తో పాటు ఐటీ చట్టంలోని 66-డీ సెక్షన్ కింద నిందితులపై చర్యలు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా ఈ ముఠాకు సంబంధించి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. కొందరు సమన్వయకర్తలు మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తుండగా, మధ్యవర్తులు అమాయకుల‌కు డబ్బు ఆశ చూపించి వారి పేర్లపై బ్యాంక్ ఖాతాలు తెరిపించారు. ఖాతాదారులు తమ ఖాతాలను నేరగాళ్లకు అప్పగించగా, ఆ ఖాతాల ద్వారా సైబర్ మోసాల సొమ్మును విదేశాలకు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో బండారి సాయిరాం, అనుమాండ్ల రంజిత్, అలిగేటి మల్లేశం, బోగ రాకేష్, బండి ప్రణయ్ ఉన్నారు.

అలాగే, ఆర్‌బీఎల్ బ్యాంక్ మేనేజర్ భువనగిరి కళ్యాణ్, అయేషా బేగం కూడా అరెస్ట్ అయ్యారు. మరికొందరు ఖాతాదారులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావాదేవీల వివరాల ప్రకారం.. వర్చువల్ ఖాతాల ద్వారా రూ.12.25 కోట్లు, ఆర్‌బీఎల్ బ్యాంక్ మ్యూల్ ఖాతాల ద్వారా రూ.125.80 కోట్లు చలామణి అయినట్లు గుర్తించారు. అయితే, కమిషన్ కోసం ఆశ‌ప‌డి తమ బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, లాగిన్ వివరాలను ఇతరులకు ఇవ్వవద్దని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. తెలియని వ్యక్తుల కోసం ఖాతాలు తెరవడం కూడా నేరమేనని స్పష్టం చేశారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్, అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement