Kalvakuntla Kavitha | రేవంత్‌ను కర్కోటకుడు అనాలంటే బాధ అనిపిస్తుంది : కవిత
Kalvakuntla Kavitha | రాష్ట్రంలో కర్కోటకుడి, నియంత పాలన నడుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. ఒక పొలిటికల్ లీడర్‌ను కర్కోటకుడు అనాలంటే బాధ అనిపిస్తుంది.. కానీ తప్పని పరిస్థితి అని కవిత పేర్కొన్నారు.
Kalvakuntla Kavitha | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో కర్కోటకుడి, నియంత పాలన నడుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. ఒక పొలిటికల్ లీడర్‌ను కర్కోటకుడు అనాలంటే బాధ అనిపిస్తుంది.. కానీ తప్పని పరిస్థితి అని కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కవిత ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...కర్కోటక, నియంత సీఎం. వెలుగుమట్లలో అన్ని పర్మిషన్లు ఉన్న సరే అక్కడి ప్రజల ఇళ్లను కూల్చేశారు. ఆ బాధతో ఒక గర్భిణీకి అబార్షన్ అయితే ఆమె తండ్రి రోదన కళ్ల ముందు ఇంకా మెదులుతుంది. రెండు నెలల చిన్నారిని కాళ్లతో తన్ని చంపితే ఇప్పటికీ కూడా కేసు పెట్టలేదు. గురుకులాల్లో విషం పెట్టి విద్యార్థులను చంపుతుంటే ఈ ప్రభుత్వం స్పందించటం లేదు. కర్ల రాజేష్ అనే యువకుడిని లాకప్ డెత్ చేస్తే ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు. అందుకే ఈ ముఖ్యమంత్రిని కర్కోటక, నియంత ముఖ్యమంత్రి అంటున్నాను.
ఈ మూడు పార్టీలపై అలుపెరగని పోరాటం
రాష్ట్రంలో ఇప్పుడున్న మూడు పార్టీలు కుటుంబ పాలన, అవినీతి, బంధుప్రీతితో నిండిపోయాయి. రాహుల్ గాంధీని ప్రధాని చేయటం కాంగ్రెస్ అజెండా అయితే పెద్ద సార్ ఫామ్ హౌస్ లో ఉండి...చిన్న సార్ ను సీఎం చేయాలన్నది బీఆర్ఎస్ అజెండా. ఇక సామాజిక న్యాయాన్ని ఖతం పట్టించటమే బీజేపీ సింగిల్ అజెండా. ఈ మూడు పార్టీల మీద అలుపెరగని పోరాటం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సేన సిద్దంగా ఉండాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
కర్కోటకుడైన రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారు.#failedcongress #TRS #TRSparty pic.twitter.com/wOJ3K4QClc
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 25, 2026
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



