Kalvakuntla Kavitha | బీఆర్ఎస్ ఆత్మను కోల్పోయింది.. అందుకే టీఆర్ఎస్ : కవిత
Kalvakuntla Kavitha | భారత రాష్ట్ర సమితి ఆత్మను కోల్పోయినందుకే తెలంగాణ రాష్ట్ర సేన పురుడు పోసుకుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రథచక్రం దారి తప్పిందని.. సామాజిక తెలంగాణ కోసం కష్టపడి పని చేస్తామని ఆమె ఉద్ఘాటించారు.
Kalvakuntla Kavitha | త్రినేత్ర.న్యూస్ : భారత రాష్ట్ర సమితి ఆత్మను కోల్పోయినందుకే తెలంగాణ రాష్ట్ర సేన పురుడు పోసుకుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రథచక్రం దారి తప్పిందని.. సామాజిక తెలంగాణ కోసం కష్టపడి పని చేస్తామని ఆమె ఉద్ఘాటించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రకటన సందర్భంగా కేసీఆర్‌ను ఉద్దేశించి కవిత ఆగ్రహంతో ఉపన్యాసించారు.
తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రథ చక్రం దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆశలు, ఆర్తిని అర్థం చేసుకోవటంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది. సామాజిక తెలంగాణ రథ చక్రం పూర్తిగా విరిగి ముక్కలైంది. ఏ కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో అవి నిజం కాలేదు. తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు పోతాయని భావిస్తే... రైతులకు బేడీలు వేశారు. ఇసుక దందా మీద ప్రేమతో దళితుల మీద లాఠీలు విరిగాయి. ఫోన్లు ఎక్కడ వింటారోనని వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా బతకాల్సి వచ్చింది.. దారుణమైన నిఘా నీడలో తెలంగాణ అంతా బతికింది.
అందుకు క్షమాపణ మాత్రమే చెబితే సరిపోదు..
ఆనాడు తెలంగాణ కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగింది. ఉద్యమకారులు ఒక హోదా మాత్రమే కోరుకున్నారు.. పదేళ్లు అధికారంలో ఉండి కనీసం వారికి నామినేటేడ్ పోస్టులు కూడా ఇవ్వలేదు. ఉద్యమంలో మనల్ని అవహేళన చేసి లాఠీలతో కొట్టించిన వారే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెత్తనం చెలాయించారు. ఆనాడు పరిపాలన చేసిన కుటుంబంలో తాను కూడా భాగమేనని అందుకు క్షమాపణ మాత్రమే చెబితే సరిపోదు.
ప్రజా ఉద్యమాలను మిళితం చేసి రాజకీయాలు చేస్తాం..
సామాజిక తెలంగాణలో కోసం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది.. తమ పనితీరు ఎలా ఉంటుందో ముందు ముందు ప్రజలు చూస్తారు. ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయ అధికారం కావాల్సి ఉంటుంది. రాజ్యాంగ పరంగా ప్రజా ఉద్యమాలను మిళితం చేసి రాజకీయాలు చేస్తాం. ఏ పార్టీకైనా ఆత్మ నేపథ్యం ఉండాలని.. బీఆర్ఎస్ దాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్ ఆత్మను కోల్పోయినందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చిందని కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



