త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kakatiya Kala Thoranam | రూ.10 లక్షల బిడ్‌తో టాప్-3లో కాకతీయ కళాతోరణం

Kakatiya Kala Thoranam | ప్రధాని నరేంద్ర మోదీకి అందిన సుమారు 1,500 కానుకల ఈ-వేలంలో తెలంగాణకు చెందిన వెండి కాకతీయ కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ.9 లక్షల బేస్‌ ప్రైస్‌తో వేలంలో ఉంచిన ఈ కళాఖండానికి రూ.10 లక్షల బిడ్‌ నమోదైంది. దీంతో అత్యధిక బిడ్‌ దక్కిన కానుకల్లో ఇది టాప్‌-3లో నిలిచింది.

P

Telangana | Published On Oct 2, 2026, 8.31 pm IST

Kakatiya Kala Thoranam | రూ.10 లక్షల బిడ్‌తో టాప్-3లో కాకతీయ కళాతోరణం
Advertisement

Kakatiya Kala Thoranam | ప్రధాని నరేంద్ర మోదీకి అందిన సుమారు 1,500 కానుకల ఈ-వేలంలో తెలంగాణకు చెందిన వెండి కాకతీయ కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ.9 లక్షల బేస్‌ ప్రైస్‌తో వేలంలో ఉంచిన ఈ కళాఖండానికి రూ.10 లక్షల బిడ్‌ నమోదైంది. దీంతో అత్యధిక బిడ్‌ దక్కిన కానుకల్లో ఇది టాప్‌-3లో నిలిచింది. వేలంలో అత్యధికంగా జగన్నాథ పరివార్‌ ఆన్‌ చారియట్‌కు రూ.21 లక్షల బిడ్‌ వచ్చింది. కర్ణాటకకు చెందిన వెండి శ్రీరాముడి మెమెంటోకు రూ.13,50,200 బిడ్‌ నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో రూ.10 లక్షల బిడ్‌తో కాకతీయ కళాతోరణం నిలిచింది. తెలంగాణకు చెందిన మరో 14 కానుకలు కూడా ఈ-వేలంలో ఉన్నాయి. వీటిలో చేర్యాల పెయింటింగ్‌కు రూ.54,100, చిన్న కాకతీయ కళాతోరణానికి రూ.30,700, శ్రీరాముడి జ్ఞాపికకు రూ.20,900 బిడ్‌ వచ్చింది. వరంగల్‌ గేట్‌–అంబేద్కర్‌ జ్ఞాపికకు రూ.9 వేల బిడ్‌ నమోదైంది. సంప్రదాయ హస్తకళలు, దేవతా విగ్రహాలు, ఆలయ నమూనాలు, ప్రధాని మోదీ చిత్రాలు, క్రీడా జ్ఞాపికలు తదితరాలను ఈ వేలంలో ఉంచారు. 2018 నుంచి నిర్వహిస్తున్న ఈ-వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు వినియోగిస్తోంది.

Advertisement
Advertisement