Juloori Gouri Shankar | కేఎల్ కృషిని ఉపవాచకాలుగా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి
Juloori Gouri Shankar | సామాజిక వికాసం కోసం సాంస్కృతిక సైనికుడిగా జీవితాన్ని అంకితం చేసిన కేఎల్ నరసింహారావు (KL Narasimha Rao) కృషిని ఉపవాచకాలుగా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, కవి జూలూరి గౌరీశంకర్ (Juloori Gouri Shankar) కోరారు.
- సమాజ దురాగతాలపై ఆయన కలాన్ని నడిపారు
- తన జీవితాన్ని రంగస్థలంకే అంకితం చేశారు
- జయంతి సభలో తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్
Juloori Gouri Shankar | త్రినేత్ర న్యూస్: సామాజిక వికాసం కోసం సాంస్కృతిక సైనికుడిగా జీవితాన్ని అంకితం చేసిన కేఎల్ నరసింహారావు (KL Narasimha Rao) కృషిని ఉపవాచకాలుగా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, కవి జూలూరి గౌరీశంకర్ (Juloori Gouri Shankar) కోరారు. సమాజ దురాగతాలపై తన కలాన్ని ఎక్కుపెట్టారని.. తన జీవితాన్ని రంగస్థలంకే అంకితం చేశారన్నారు. కొనియాడారు. వీర తెలంగాణ పోరు ఘట్టాలను గాంధేయ మార్గంలో నాటకాలుగా రచించి వేలాది ప్రదర్శనలు ఇచ్చిన సాంస్కృతిక యోధుడని కొనియాడారు. కె.ఎల్ 102వ జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మునగాల మండలం రేపాలలో శుక్రవారం కేఎల్ విగ్రహం వద్ద వేముల వెంకటేశ్వర్లు సంపాదకత్వంలో వెలువరించిన "నాటక రంగ శిఖరం కె.ఎల్ నరసింహారావు"పుస్తకాన్ని జూలూరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఆ బాధ్యత ప్రభుత్వానిదే
కళ్ళ ముందు జరుగుతున్న దురాగతాలను ప్రజలకు తెలియజేస్తూ రచనలు చేయడమే సాహిత్యకారులు చేయవలసిన పని. వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని కళ్లారా చూసిన కె.ఎల్ "విప్లవ శంఖం", "గెలుపు నీదే" నాటకాలను రాశారు. 100కు పైగా నాటకాలు రాసి వేలాది ప్రదర్శనలు ఇచ్చిన రంగస్థలం చరిత్ర కె.ఎల్. రచనలను నేటి తరానికి తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
పీవీ తిలకించారు..
వీర తెలంగాణ పోరాటం ఎగుస్తున్న వేళ అనేక రచనలు చేసి నాటక రంగ జెండాను ఎత్తి పెట్టారు. తను పుట్టిన ఊరుని రంగస్థలం వేదికగా మార్చి "గ్రామ వెలుగు నాట్య కళామండలి" పేరుతో ఒక సంవత్సర కాలం నిరాఘాటంగా ప్రదర్శనలు ఇచ్చి గిన్నిస్ రికార్డును మించిన చరిత్రను సృష్టించారు. ఆయన నాటక ప్రదర్శనలు చూసేందుకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దగ్గర నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రేపాల గ్రామం మట్టిపై కూర్చుని తిలకించారు. కళ్ళ ముందు జరుగుతున్న దురాగతాలపై నిరంతరం ప్రజల దృక్పథం నుంచి రచనలు రావలసిన అవసరం ఉంది.
మునగాల పరగణ సాయుధ పోరాటానికి శిక్షణ కేంద్రం అయితే, నడిగూడెం గ్రంథాలయ ఉద్యమాన్ని, రేపాల నాటక రంగ జెండాను చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా కృషిచేసిన సాహిత్య సంస్కృతిక కేంద్రాలని సింహావలోకనం చేశారు. తెలంగాణ నాటక రంగ చరిత్రలో కె.ఎల్ ది చెరిగిపోని అధ్యాయం అని కొనియాడారు.
సూర్యాపేట జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, మనం వికాస వేదిక అధ్యక్షులు పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ... గ్రామాలను చైతన్యం చేయడం కోసం, సమాజ చైతన్యం కోసం నిరంతరం రచనలు చేసి ప్రజల నాలుకలపై సజీవంగా కె.ఎల్ ఉన్నారన్నారు. రేపాల లాంటి గ్రామానికి అనేకమంది కళాకారులను పరిచయం చేసిన రంగస్థల దిగ్గజం అన్నారు.
తెలంగాణ మట్టి గర్వించదగ్గ కేఎల్ నరసింహారావు వంటి మహా రచయితపై పుస్తకం రావడం ఆహ్వానించదగిందని మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిలర్ నూకల కవిత వేణుగోపాల రెడ్డి అన్నారు. అనంతరం కౌన్సిలర్ జేసిడి శేఖర్ రెడ్డి, తడకమళ్ళ రామచంద్రరావు, కోదాటి సాయి సుజిత నరసింహారావు రచయిత చకోనా, బోయినపల్లి వెంకటరమణారావు, పులి కృష్ణమూర్తి తదితరులు మాట్లాడారు. పుస్తక రచయిత, అధ్యాపకులు వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కే ఎల్ వంటి సుప్రసిద్ధ నాటక రచయిత పుస్తకాన్ని వెలువరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
ఈ కార్యక్రమానికి మొగిలిచర్ల సత్యనారాయణ సభాధ్యక్షత వహించగా రేపాకుల గురవయ్య, పందిరి పుల్లారెడ్డి, సుంకర అజయ్ కుమార్, యుగంధర్ రెడ్డి, గెల్లి రంగారావు, కోదాటి వెంకటరమణ, వెంపటి పిచ్చేశ్వర రావు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●BCI | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నిర్ణయాలపై బీసీఐ స్టే
- ●OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, సిరీస్‌లు ఇవే - నాని, కీర్తి సురేష్ మూవీస్‌ను మిస్సవ్వొద్దు
- ●Vakiti Srihari | ఖేలో ఇండియా పోటీల కోసం ప్రతిభ ఆధారంగానే అవకాశాలు
- ●Karnataka High Court | సోషల్ మీడియా పోస్టులు.. విచారణ లేకుండా యంత్రాల్లా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడమేంటి..?
- ●Sridhar Babu | 1100 కాల్ చేస్తే.. మీ ఇంటికే మీ సేవ సర్టిఫికెట్లు
- ●Ponguleti Srinivas Reddy | క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యం.. యుద్ధ ప్రతిపాదికన స్థలాలు గుర్తించాలి

BCI | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నిర్ణయాలపై బీసీఐ స్టే

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, సిరీస్‌లు ఇవే - నాని, కీర్తి సురేష్ మూవీస్‌ను మిస్సవ్వొద్దు

Vakiti Srihari | ఖేలో ఇండియా పోటీల కోసం ప్రతిభ ఆధారంగానే అవకాశాలు

Karnataka High Court | సోషల్ మీడియా పోస్టులు.. విచారణ లేకుండా యంత్రాల్లా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడమేంటి..?






