Jogu Ramanna | ఆదిలాబాద్‌ను సీఎం రేవంత్‌ను నయవంచన చేశారు : జోగు రామన్న
Jogu Ramanna | ఆదిలాబాద్‌ని సీఎం రేవంత్‌రెడ్డి నయవంచన చేశారని మాజ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలప్పుడు ఆదిలాబాద్‌ని దత్తత తీసుంటానని చెప్పి మాట తప్పారని, ఈ రెండేళ్లలో ఆదిలాబాద్‌కు చేసిన పని ఒక్కటీ లేదన్నారు. కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యారని, హౌస్ అరెస్టులు లేవని ప్రజాస్వామ్య విలువలను పాటిస్తున్నామని నిన్న సీఎం పచ్చి అబద్దం చెప్పారన్నారు. తనను ఏన్నో సార్లు హౌస్ అరెస్ట్ చేశారని. హరీష్ రావు ఇవాళ పరిగి వెళ్తుంటే ఈ రోజు ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉండి ఇంత పచ్చిగా అబద్దాలు మాట్లాడటానికి రేవంత్‌కు సిగ్గు అనిపించడం లేదా? అంటూ విమర్శించారు. సోమవారం పిప్రి గ్రామంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు 17 మాత్రమేనని.. అందులో పూర్తయినవి 3 మాత్రమే.. ఆదిలాబాద్ జిల్లాలో 11 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయితే పూర్తయినవి 550 మాత్రమేనని మండిపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎం నాతో చర్చకు వస్తారా ? అంటూ సవాల్ విసిరారారు.
ఇది అభివృద్ధి ఎలా అవుతుందని, రోడ్లకు శంకుస్థాపనలు తప్ప పూర్తయ్యింది లేదని మండిపడ్డారు. ఆదిలాబాద్‌లో రూ.50 కోట్లతో ఐటీ హబ్ నిర్మిస్తే దాన్ని ప్రారంభించడం లేదని, కేసీఆర్ హయాంలో 3 మెడికల్ కాలేజీలు ఆదిలాబాద్‌కు తెచ్చామన్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ కళాశాలను నిర్లక్ష్యం చేశారని, ఇచ్చిన హామీలను పక్కన పెట్టారన్నారు. ఆదిలాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ఎందుకు మొదలు పెట్టలేదని, దళిత, గిరిజనులకు మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో వచ్చిన గురుకులాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, మెస్సితో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడటానికి సింగరేణి నుంచి రూ.100 కోట్ల సీఎం దారి మళ్లించారన్నారు. రూ.500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని సీఎం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా ?ఏ కాంగ్రెస్ నేత నాతో చర్చకు వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీల్లో 99శాతం అమలు అవుతున్నాయని భట్టి పచ్చి అబద్దం చెప్పారన్నారు. అప్పుల గురించి అబద్దాలు మాట్లాడుతున్నారని, తెలంగాణ మహిళలను సీఎం ఘోరంగా అవమానించారని, మూడు నెలలకే పిల్లలు పుడతారా అని సీఎం అనొచ్చా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతుందని, నువ్వు చెప్పిన సమయం కూడా అయిపోయింది కదా.. ఇంత నిస్సిగ్గుగా సీఎం నోటి నుంచి అబద్దాలా ? అంటూ విమర్శించారు. చిలుక పచ్చ చీరలతో మహిళలు చిలుకల్లా కనిపిస్తారని సీఎం అనడం మహిళలను అవమానించడమేనన్నారు. సీఎం తన మనువడి అక్షరాభ్యాసం కోసం బాసర వచ్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. బాసర ఇపుడే గుర్తొచ్చిందా ? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేసీఆర్ టైమ్‌లోనే అన్నింటా అభివృద్ధి జరిగిందని, చనకా కొరటా ప్రాజెక్టు ,ఇతర పెండింగ్ ప్రాజెక్టుల గురించి సీఎం మాట్లాడలేదన్నారు. పాత ప్రాజెక్టుల ప్రస్తావన లేదని, కానీ ఏవో లిఫ్ట్ ల గురించి మాట్లాడ లేదన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవని, కేరళ సీఎంకు రేవంత్ ఓ లేఖ రాశారని, కేరళలో గతంలో యూడీఎఫ్ ప్రభుత్వం అభివృద్ధి గురించి రేవంత్ ఆ లేఖలో ప్రస్తావించారని, మరి తెలంగాణకు ఆ సూత్రం వర్తించదా ?కేసీఆర్ హయాంలో పదేళ్లలో జరిగిన అభివృద్ధి గురించి రేవంత్ చెప్పరా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఏం చేయకున్నా దైర్యంగా అబద్దాలను చెబుతూ తనకంటే మోసగాడు మరెవ్వరూ లేరని నిరూపించుకుంటున్నారన్నారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు గురించి కూడా సీఎం అబద్దాలు చెబుతున్నారని, కాంగ్రెస్ బీజేపీ నేతలు కలిసి ఎయిర్ పోర్టు పై ఆదిలాబాద్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ పేరిట స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ దోపిడీ చేస్తున్నారని, ఆయనకు సీఎం సహకరిస్తున్నారన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

KTR | పళ్లు ఇకిలించుకుంటూ సెల్ఫీలు.. కేటీఆర్‌పై రేవంత్ విమర్శలు
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



