త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Sushmitha | జనసేనలోకి కొండా సుష్మిత.. క్లారిటీ ఇచ్చిన పార్టీ

తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం! కొండా సుస్మిత తమతో టచ్‌లో ఉన్నారని జనసేన ప్రకటించింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పవన్‌తో కలుస్తారని బాంబు పేల్చింది.

J

Telangana | Published On Aug 26, 2026, 8.01 pm IST

Konda Sushmitha | జనసేనలోకి కొండా సుష్మిత.. క్లారిటీ ఇచ్చిన పార్టీ
Advertisement

Konda Sushmitha | త్రినేత్ర.న్యూస్ : మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత తమతో టచ్‌లో ఉందని జనసేన పార్టీ బాంబు పేల్చింది. తమ పార్టీ వరంగల్ నేతలతో టచ్‌లో సుష్మిత ఉందని జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ అన్నారు. సుష్మితతో పాటు కొండా మురళి, సురేఖ వస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వాళ్లు పార్టీలోకి వస్తే పార్టీ బలోపేతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా జనసేనలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసిన చాలామంది నేతలు, యూత్, మేధావులు కూడా తమతో టచ్‌లో ఉన్నారని, వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వీళ్లందరితో కలిసి ముందుకెళ్తామని శంకర్ గౌడ్ తెలిపారు.

Advertisement
Advertisement