త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | విస్తృత రోడ్‌షోలు నిర్వ‌హించి పెట్టుబ‌డుదారుల‌ను ఆహ్వానిద్దాం

Bhatti Vikramarka | తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0పై దేశీయంగా, అంత‌ర్జాతీయంగా విస్తృత రోడ్‌షోలు నిర్వహించి పెట్టుబడిదారులను తెలంగాణకు ఆహ్వానించాలని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు. రాష్ట్ర ఆర్థిక ప్ర‌గ‌తికి కొత్త ఊపునివ్వ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు.

S

Telangana | Published On Aug 26, 2026, 7.15 pm IST

Bhatti Vikramarka | విస్తృత రోడ్‌షోలు నిర్వ‌హించి పెట్టుబ‌డుదారుల‌ను ఆహ్వానిద్దాం
Advertisement
  • రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కొత్త ఊపునిద్దాం
  • తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 కార్యాచ‌ర‌ణ‌పై స‌మావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0పై దేశీయంగా, అంత‌ర్జాతీయంగా విస్తృత రోడ్‌షోలు నిర్వహించి పెట్టుబడిదారులను తెలంగాణకు ఆహ్వానించాలని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు. రాష్ట్ర ఆర్థిక ప్ర‌గ‌తికి కొత్త ఊపునివ్వ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా పటిష్టమైన కార్యాచరణ, ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌లో ఈ సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లు, కార్యాచరణపై బుధ‌వారం నిర్వ‌హించిన‌ కేబినెట్ సబ్-కమిటీ సమావేశంలో ఆయ‌న మాట్లాడారు.

డిసెంబర్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి. సమ్మిట్ ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రజాభవన్‌లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు, నిపుణులు, కీలక అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయాలి. గత గ్లోబల్ సమ్మిట్‌లో కుదిరిన అవగాహన ఒప్పందాల పురోగతిని సమగ్రంగా సమీక్షించి, పెట్టుబడుల వాస్తవ కార్యరూపంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

సమ్మిట్‌కు సంబంధించిన ప్రతి పనిని నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేస్తూ, ఏర్పాట్లపై నిరంతర సమీక్షలు నిర్వహించాలి. తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా నిలిపి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కొత్త ఊపునివ్వాలి అని భ‌ట్టి సూచించారు.

ఈ స‌మావేశంలో మంత్రులు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, శ్రీ‌ధ‌ర్‌బాబు, ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement