Jaggareddy | సంగారెడ్డిలో 70 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేసిన జగ్గారెడ్డి
Jaggareddy | సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా మరో 70 మంది చిన్నారులకు సైకిళ్లు అందజేశారు. ప్రత్యేకంగా 8 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులకు ఈ విడతలో సైకిళ్లు పంపిణీ చేశారు.
Jaggareddy | సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా మరో 70 మంది చిన్నారులకు సైకిళ్లు అందజేశారు. ప్రత్యేకంగా 8 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులకు ఈ విడతలో సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు మొత్తం 400 మంది చిన్నారులకు సైకిళ్లు అందినట్లు నిర్వాహకులు తెలిపారు. తమ కార్యాలయంలో ఆధార్ జిరాక్స్‌తో పేర్లు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ విడతల వారీగా సైకిళ్లు అందిస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అదే కార్యక్రమంలో, గతంలో పేర్లు నమోదు చేసుకున్న మరో 156 మంది చిన్నారులకు టోకెన్లు పంపిణీ చేశారు. వచ్చే ఆదివారం వారికి సైకిళ్లు అందజేయనున్నట్లు తెలిపారు. సైకిళ్ల పంపిణీ సందర్భంగా జగ్గారెడ్డి చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ కొంతసేపు గడిపారు. వారితో కరచాలనం చేస్తూ పలకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, సీనియర్ నాయకులు కూన సంతోష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు




