Jagga Reddy | రాహుల్ సూచనలు ప్రధాని వింటున్నా.. అమలు చేయడం లేదు : జగ్గారెడ్డి
Jagga Reddy | రాహుల్ గాంధీ సూచనలు ప్రధాని మోదీ వింటున్నా అమలు చేయడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ బాధ్యతగల ప్రతిపక్ష నేతగా దేశ ప్రజల సంక్షేమం కోసం పార్లమెంట్‌లో విలువైన సలహాలు ఇస్తున్నారన్నారు. అయితే, రాహుల్ గాంధీ సూచనలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వింటున్నా వాటిని అమలు చేయడం జరుగలేదని ఆయన ఆరోపించారు. కరోనా, ఢిల్లీ కాలుష్య సమస్యల విషయంలో రాహుల్ గాంధీ ముందుగానే కేంద్ర ప్రభుత్వాన్ని అలెర్ట్ చేశారని జగ్గారెడ్డి చెప్పారు. విదేశాల నుంచి ఇండియాకు వచ్చే వ్యక్తులపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారని, కానీ ప్రధాన మంత్రి ఆ సూచనలను అమలు చేయలేదని అన్నారు.
కరోనా రావడానికి ముందే సూచనలు ఇచ్చారని, తర్వాత ఏమైందో మనం అందరం చూశామని చెప్పారు. రెండు సంవత్సరాల పాటు దేశం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ఢిల్లీ కాలుష్యంపై కూడా రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతూ అవసరమైన సూచనలు చేస్తున్నారని, కానీ వాటిని ప్రధాన మంత్రి అమలు చేయడం లేదని జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు దేశ ప్రజల సంక్షేమం కోసం సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కానీ, వాటిని అమలు చేయడంలో ప్రధాన మంత్రి ఫెయిల్ అవుతున్నారన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






