Golconda Murder Case | చెల్లెలి ప్రేమ వివాహం.. పగతో రగిలిన అన్న..
Golconda Murder Case | ఇద్దరు ప్రేమ వివాహంతో ఒక్కటయ్యారు. ఈ బంధం రెండు కుటుంబాలను కలపాల్సింది పోయి.. రక్తపాతానికి దారి తీసింది. చెల్లెలు ప్రేమ వివాహం గిట్టని ఓ అన్న చెల్లెలు భర్తను హతమార్చాడు. గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంచలన హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరుచగా జ్యుడీషియల్ రిమాడ్‌కు పంపింది.
- ఇంట్లోకి చొరబడి చెల్లెలి భర్తపై దాడి
- గోల్కొండ హత్యకేసులో నలుగురి అరెస్ట్
- జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
Golconda Murder Case | ఇద్దరు ప్రేమ వివాహంతో ఒక్కటయ్యారు. ఈ బంధం రెండు కుటుంబాలను కలపాల్సింది పోయి.. రక్తపాతానికి దారి తీసింది. చెల్లెలు ప్రేమ వివాహం గిట్టని ఓ అన్న చెల్లెలు భర్తను హతమార్చాడు. గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంచలన హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరుచగా జ్యుడీషియల్ రిమాడ్‌కు పంపింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంచలనాత్మక హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య వివరాలను మీడియాకు వివరించారు. గతేడాది జనవరి రుక్సార్ బేగం అనే యువతిని షేక్ మహబూబ్ అలియాస్ మసూద్ చండి (26) ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతను ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు.
అయితే, వీరిద్దరి ప్రేమ వివాహం రుక్సార్ సోదరుడైన షేక్ జాహెద్‌కు నచ్చలేదు. తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరిగాయి. గతంలోనూ వాగ్వాదాలు జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే జూన్ 12న మధ్యాహ్నం షేక్ జాహెద్ తన స్నేహితులు జీషన్ నవాబ్, అమీర్, నఫీజ్ సుల్తానాతో కలిసి కుమార్వాడిలోని చెల్లెలు రుక్సార్ ఇంటికి చేరుకున్నాడు. ఇనుప రాడ్లు, కత్తులు, కర్రలతో ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన నిందితులు ఒక్కసారిగా మహబూబ్‌పై దాడికి దిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులపై సైతం దాడి చేశారు. షేక్ జాహెద్ ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టగా, జాబర్ కత్తితో విచక్షణారహితంగా పొడవగా మసూద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
అడ్డుకునేందుకు ప్రయత్నించి అతని తండ్రి ఇస్మాయిల్ షేక్‌కు సైతం గాయాలయ్యాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత టోలిచౌకి ఏసీపీ సయ్యద్ ఫయాజ్ పర్యవేక్షణలో గోల్కొండ పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 13న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి జిమ్ ఇనుపరాడ్, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే, హత్య వెనుక ఉన్న కారణాలు, గొడవలు, కుటుంబ సంబంధాలపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జులై 18, 2026

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
జులై 18, 2026

Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
జులై 18, 2026
తాజావార్తలు
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం
- ●HYD Traffic | ట్రాఫిక్ నియంత్రణకు 30 కొత్త పెట్రోలింగ్ బైక్‌లు.. ప్రారంభించిన సీపీ సజ్జనార్
- ●The Odyssey Review | ది ఒడిస్సీ రివ్యూ - కథను కాకుండా ఎలివేషన్లను నమ్ముకున్న క్రిస్టోఫర్ నోలన్ - హాలీవుడ్ మూవీ ఎలా ఉందంటే?
- ●El Niño | ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి

Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ

TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం

HYD Traffic | ట్రాఫిక్ నియంత్రణకు 30 కొత్త పెట్రోలింగ్ బైక్‌లు.. ప్రారంభించిన సీపీ సజ్జనార్



