త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కేసీఆర్‌ను ఇప్ప‌టికీ గుర్తు చేసుకుంటున్నారు.. సీఎం రేవంత్ అభిమాని లేఖ వైర‌ల్

CM Revanth Reddy | వ్య‌వసాయ రంగంతో పాటు రైతుల క‌ష్టాల‌పై సీఎం రేవంత్ రెడ్డికి ఆయ‌న అభిమాని రాసిన లేఖ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుంది. 65 శాతానికి పైగా రైతులు సీఎం రేవంత్‌కు వ్య‌తిరేకంగా ఉన్నార‌ని ఆ అభిమాని త‌న లేఖ‌లో పేర్కొన్నాడు.

S

Telangana | Published On Jun 10, 2026, 7.54 pm IST

CM Revanth Reddy | కేసీఆర్‌ను ఇప్ప‌టికీ గుర్తు చేసుకుంటున్నారు.. సీఎం రేవంత్ అభిమాని లేఖ వైర‌ల్
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : వ్య‌వసాయ రంగంతో పాటు రైతుల క‌ష్టాల‌పై సీఎం రేవంత్ రెడ్డికి ఆయ‌న అభిమాని రాసిన లేఖ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుంది. 65 శాతానికి పైగా రైతులు సీఎం రేవంత్‌కు వ్య‌తిరేకంగా ఉన్నార‌ని ఆ అభిమాని త‌న లేఖ‌లో పేర్కొన్నాడు. ఇప్ప‌టికీ కేసీఆర్‌ను రైతులు గుర్తు చేసుకుంటున్నార‌ని, ఈ లేఖ బాధ‌తో రాస్తున్నాన‌ని స‌ద‌రు వ్య‌క్తి తెలిపాడు.

లేఖ సారాంశం ఏంటంటే..

ప్రియ‌మైన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారికి నా మ‌న‌వి..

నేను పుట్టుక‌తోనే కాంగ్రెస్ మ‌రియు మీ అభిమానిని. ప్ర‌తి గ్రామంలో, ప్ర‌తి మండ‌లంలో వ్య‌వ‌సాయ రంగం ప్ర‌భుత్వానికి మీకు వ్య‌తిరేక‌త ఉంది 65 శాతం. మీరు దానిని గ‌మ‌నించ‌డం లేదు. మీరు అంటే నాకు చాలా ఇష్టం. మీ గురించి, ప్ర‌భుత్వం గురించి రైతులు ప్ర‌తి సొసైటీ వ‌ద్ద తిడుతుంటే నేను విని భ‌రించ‌లేక‌పోతున్నాను. మీరు రైతుల‌కు త‌ప్ప ఎన్నో హైడ్రా లాంటి ఎన్నో కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేని యూరియా యాప్ మ‌న రాష్ట్రంలో ఎందుకు..? యాప్‌ను తీసివేయ‌గ‌ల‌రు. వేరే కార్య‌క్ర‌మాలు ఆపిన స‌రే.. మిమ్మ‌ల్ని న‌మ్ముకున్న రైతుల‌కు య‌ధావిధిగా రైతుబంధు వేయ‌గ‌ల‌రు. ఈ రెండు అమ‌లు చేసిన‌చో మీకు రైతుల‌ము పాలాభిషేకం చేస్తాం. ఈ రెండు ప‌థ‌కాలు చేయ‌గానే మీకు వ్య‌తిరేక‌త ఉంది. ఈ రెండు ప‌థ‌కాలు అమ‌లు చేసిన కేసీఆర్ గారిని గ్రామాల్లో గుర్తు చేసుకుంటున్నారు.

ఇట్లు
మీ అభిమాని
జీ వెంక‌ట్ రావు
కామారెడ్డి జిల్లా

Advertisement
Advertisement