త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assembly Session | అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవమానం.. భ‌ట్టి చాంబర్‌లోకి నో ప‌ర్మిష‌న్‌

అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు (Congress MLAs) అవమానం జ‌రిగింది. స‌మావేశాల ప్రారంభానికి ముందు ఎమ్మెల్యేలు మందుల సామెలు, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయ రమణరావు ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) చాంబర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

G

Telangana | Published On Mar 16, 2026, 12.48 pm IST

Assembly Session | అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవమానం.. భ‌ట్టి చాంబర్‌లోకి నో ప‌ర్మిష‌న్‌
Advertisement

Assembly Session | త్రినేత్ర‌.న్యూస్‌: అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు (Assembly Session) ప్రారంభ‌మ‌య్యాయి. తొలిరోజు ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ శివ‌ప్ర‌తాప్ శుక్లా ప్ర‌సంగించారు. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు (Congress MLAs) అవమానం జ‌రిగింది. స‌మావేశాల ప్రారంభానికి ముందు ఎమ్మెల్యేలు మందుల సామెలు, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయ రమణరావు ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) చాంబర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే స‌మ‌యంలో అక్క‌డే ఉన్న డిప్యూటీ సీఎం గ‌న్‌మెన్లు వారిని అడ్డుకున్నారు. లోప‌లికి వెళ్లేందుకు వారిని అనుమ‌తించ‌లేదు. దీంతో ముగ్గురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో అక్క‌డి నుంచి వెనుదిరిగారు.

కాగా, అంత‌కుముందు అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని (Telangana Talli Statue) గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆవిష్క‌రించారు. అనంత‌రం గాంధీ, అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు నివాళుల‌ర్పించారు.

Advertisement
Advertisement