Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు భారీ స్పందన
Indiramma Illu | అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పేద, అల్పాదాయ వర్గాలకు సొంతింటిని అందించేందుకు చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకానికి భారీ స్పందన లభిస్తోంది. హైదరాబాద్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో నిర్మించనున్న 7,340 ఇళ్లకు శనివారం నాటికి 35,125 దరఖాస్తులు వచ్చాయని హౌసింగ్ బోర్డు వైస్‌చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు.
- 7,340 ఇళ్లకు 35,125 దరఖాస్తులు.. మరో రెండు రోజులే గడువు
- ఈ నెల 20 తర్వాత లాటరీ.. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి
Indiramma Illu | అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పేద, అల్పాదాయ వర్గాలకు సొంతింటిని అందించేందుకు చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకానికి భారీ స్పందన లభిస్తోంది. హైదరాబాద్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో నిర్మించనున్న 7,340 ఇళ్లకు శనివారం నాటికి 35,125 దరఖాస్తులు వచ్చాయని హౌసింగ్ బోర్డు వైస్‌చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ నెల 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణానికి సంకల్పించగా.. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో 500 ఇళ్ల చొప్పున నిర్మిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో రూ.30 లక్షల నుంచి రూ.58 లక్షల వరకు విలువ చేసే ఫ్లాట్లను కేవలం రూ.6 లక్షలకే అందించనున్నట్లు గౌతం తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో పాటు, వారు నివసిస్తున్న నియోజకవర్గంలోనే సొంతింటి సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు.
దరఖాస్తు సమయంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఇల్లు కేటాయించని వారికి చెల్లించిన రూ.10 వేల ధరావతు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో అర్హులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇళ్ల కేటాయింపునకు ఈ నెల 20 తర్వాత లాటరీ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు గౌతం తెలిపారు. టవర్స్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియను కూడా చేపట్టినట్లు చెప్పారు. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.
నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు
ఖైరతాబాద్ 4,394, అంబర్‌పేట 2,357, బహదూర్‌పుర 1,135, ఇబ్రహీంపట్నం 749, కూకట్‌పల్లి 5,233, కార్వాన్ 1,574, మహేశ్వరం 471, మలక్‌పేట 2,846, మల్కాజిగిరి 1,033, మేడ్చల్ 1,153, నాంపల్లి 3,613, సనత్‌నగర్ 1,046, కుత్బుల్లాపూర్ 4,121, రాజేంద్రనగర్ 1,496, సికింద్రాబాద్ కంటోన్మెంట్ 1,374, శేరిలింగంపల్లి 2,530 దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు సంబంధించిన సందేహాల నివృత్తికి 040-24603572 కాల్‌సెంటర్‌ను సంప్రదించవచ్చని గౌతమ్ సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Allam Narayana | బెల్టులు, లాగులు, తొండలు.. ఒక ముఖ్యమంత్రి భాష కాదిది.. ఇట్లాంటి భాష రాజకీయాల్లో చూల్లే
ఆగస్టు 8, 2026

Traffic Diversions | బోనాల వేళ హైదరాబాద్‌లో రెండురోజులు ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులకు కీలక సూచనలు..!
ఆగస్టు 8, 2026

Jemimah Rodrigues | జెమీమా రోడ్రిగ్స్‌కు గాయం.. ఆసియా కప్ ఆడేది డౌటే!
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●Keerthy Suresh | నానితో కీర్తిసురేష్ బాక్సాఫీస్ వార్ - ప్యారడైజ్‌కు పోటీగా మహానటి తమిళ మూవీ రిలీజ్
- ●కర్ణాటక ‘పోటు’.. గాంధీభవన్‌లో ‘స్క్రిప్ట్’ మార్పు? రేవంత్ యూత్ ఫార్ములాపై ఏఐసీసీ లో సస్పెన్స్!
- ●Allam Narayana | బెల్టులు, లాగులు, తొండలు.. ఒక ముఖ్యమంత్రి భాష కాదిది.. ఇట్లాంటి భాష రాజకీయాల్లో చూల్లే
- ●SpaceX Starship | హిందూ మహాసముద్రంలో చిక్కుకుపోయిన స్పేస్ఎక్స్ 'స్టార్‌షిప్'.. రికవరీ కష్టమేనా?
- ●Komatireddy Venkat Reddy | సాగు నీరు ఇవ్వలేం.. ప్రజలకు ధైర్యం చెప్పండి
- ●Traffic Diversions | బోనాల వేళ హైదరాబాద్‌లో రెండురోజులు ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులకు కీలక సూచనలు..!

Keerthy Suresh | నానితో కీర్తిసురేష్ బాక్సాఫీస్ వార్ - ప్యారడైజ్‌కు పోటీగా మహానటి తమిళ మూవీ రిలీజ్

కర్ణాటక ‘పోటు’.. గాంధీభవన్‌లో ‘స్క్రిప్ట్’ మార్పు? రేవంత్ యూత్ ఫార్ములాపై ఏఐసీసీ లో సస్పెన్స్!

Allam Narayana | బెల్టులు, లాగులు, తొండలు.. ఒక ముఖ్యమంత్రి భాష కాదిది.. ఇట్లాంటి భాష రాజకీయాల్లో చూల్లే

SpaceX Starship | హిందూ మహాసముద్రంలో చిక్కుకుపోయిన స్పేస్ఎక్స్ 'స్టార్‌షిప్'.. రికవరీ కష్టమేనా?



