OBC Census | ఓబీసీ కాలమ్ చేర్చకపోతే జనగణన బహిష్కరణ.. బీజేపీ సర్కారుకు బీసీ సంఘాల హెచ్చరిక
OBC Census | జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చకుండా కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తే మరో స్వాతంత్య్ర పోరాటం తప్పదని బీసీ సంఘాలు, అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. ఓబీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 14, 15 తేదీల్లో వేలాది మందితో ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి చేపడతామని ప్రకటించారు.
OBC Census | జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చకుండా కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తే మరో స్వాతంత్య్ర పోరాటం తప్పదని బీసీ సంఘాలు, అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. ఓబీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 14, 15 తేదీల్లో వేలాది మందితో ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి చేపడతామని ప్రకటించారు. ఓబీసీ కాలమ్ చేర్చని పక్షంలో దేశవ్యాప్తంగా జనగణనను మూకుమ్మడిగా బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఓబీసీ జాతీయ స్థాయి విస్తృత సమావేశం జరిగింది. 22 రాష్ట్రాల బీసీ ప్రతినిధులతోపాటు సీపీఐ నేతలు డి.రాజా, కే.రామకృష్ణ, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, బిహార్ ఎంపీ పప్పు యాదవ్, రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్, సీపీఎం నేత అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
లెక్కలు సేకరించకుండా కుట్ర
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీ కులాల లెక్కలు సేకరించకుండా కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో గద్దె దింపుతామని హెచ్చరించారు. ఓబీసీ కాలమ్ చేర్చే వరకు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీల పర్యటనలను అడ్డుకుంటామని, పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కూడా అడ్డుకుంటామని నేతలు ప్రకటించారు. బీసీ గణన ఇప్పుడు జరగకపోతే ఎప్పటికీ జరగదని వి.హనుమంతరావు అన్నారు. దేశంలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓబీసీ కాలమ్ కోసం రాహుల్‌గాంధీ పోరాడాలని, బీసీ సమాజం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
సీపీఐ నేతలు డీ రాజా, కే రామకృష్ణ మాట్లాడుతూ.. బీసీ కులగణన కోసం జరుగుతున్న పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే జనగణన ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓబీసీ కాలమ్ చేర్చకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా జనగణనను బహిష్కరించాలని పప్పు యాదవ్, యోగేంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి ఢిల్లీ కేంద్రంగా ప్రజాస్వామ్య పోరాటం చేయాలని కోరారు. బీసీ కులగణనకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని అరుణ్‌కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ, మహారాష్ట్రకు చెందిన బీసీ నేతలు కేసిన శంకర్రావు, భవన్‌రావు తైవాడే హెచ్చరించారు. సమావేశంలో పలు రాష్ట్రాలకు చెందిన బీసీ జాతీయ నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?






