Chintha Prabhakar | మంజీరా డ్యామ్‌ను అమృత్ ధరోహర్ పథకంలో చేర్చండి.. రామ్‌సర్ గుర్తింపునకు సహకరించండి
Chintha Prabhakar | సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్‌ను అమృత్ ధరోహర్ పథకంలో చేర్చి రామ్‌సర్ గుర్తింపునకు సహకరించాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఎకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. కలబ్‌గూర్, నందికండి ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.
- ఎకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలి
- కలబ్‌గూర్, నందికండి ప్రాచీన ఆలయాలకు నిధులివ్వండి
- కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విజ్ఞప్తి
Chintha Prabhakar | త్రినేత్ర.న్యూస్: సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్‌ను అమృత్ ధరోహర్ పథకంలో చేర్చి రామ్‌సర్ గుర్తింపునకు సహకరించాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఎకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. కలబ్‌గూర్, నందికండి ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. ఈమేరకు శుక్రవారం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆయన కేంద్రమంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పలు విషయాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంజీరా నదిపై నిర్మించిన మంజీరా డ్యామ్ తెలంగాణలో అత్యంత కీలకమైన జలాశయాల్లో ఒకటి. సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. గతంలో హైదరాబాద్ నగరానికి కూడా ప్రధాన తాగునీటి వనరుగా సేవలందించింది. మంజీరా డ్యామ్ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం, జీవవైవిధ్యం ఎకో టూరిజం అభివృద్ధికి విశేష అవకాశాలను కల్పిస్తోంది. సమీపంలోని మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం, అందులోని మొసళ్లు, మంచినీటి తాబేళ్లు, అనేక జలచర జీవులకు నిలయంగా ఉండటంతో పాటు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా నిలిచింది అని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.
మంజీరా వెట్‌ల్యాండ్‌లో సుమారు 313 రకాల పక్షులు, వాటిలో 117 రకాల వలస పక్షులు ఏటా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నాయి. జలాశయంలోని తొమ్మిది సహజ ద్వీపాలు పక్షులు, ఇతర వన్యప్రాణుల గూళ్లు నిర్మించుకోవడానికి, సంతానోత్పత్తికి అనువైన ఆవాసాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతం తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం కలిగిన జీవవైవిధ్యమైనదిగా గుర్తింపు పొందింది. ఈ విశిష్ట జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి అని ఎమ్మెల్యే ప్రభాకర్ కేంద్ర మంత్రిని కోరారు.

మంజీరా డ్యామ్ పరిసరాలలో "ఎకో టూరిజం పార్కు, ప్రకృతి అవగాహన (నేచర్ ఇంటర్‌ప్రిటేషన్) కేంద్రం ఏర్పాటు, పక్షుల వీక్షణ టవర్లు, వన్యప్రాణుల పరిశీలన వేదికలు నిర్మాణం, పర్యావరణహిత బోటింగ్ సౌకర్యాల ఏర్పాటు, ప్రకృతి విహార మార్గాలు, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌ల అభివృద్ధి, సందర్శకుల సమాచార కేంద్రం, పర్యావరణ విద్యా కేంద్రం ఏర్పాటు, ఉద్యానవనాలు, సుందరీకరణ పనులు, పర్యావరణహిత వినోద కేంద్రాల అభివృద్ధి, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, క్యాఫెటీరియా, దిశా సూచిక బోర్డులు వంటి పర్యాటక మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణహిత కాటేజీలు, క్యాంపింగ్ సదుపాయాల ఏర్పాటు, మంజీరా డ్యామ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బర్డ్ వాచింగ్, ఎకో టూరిజం కేంద్రంగా ప్రచారం చేయడంతో పర్యాటకులను ఆకట్టుకోవచ్చు. స్థిరమైన పర్యాటక అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సంగారెడ్డి జిల్లా దేశంలోనే ప్రముఖ ఎకో టూరిజం గమ్యస్థానంగా అవతరిస్తుంది అని ఎమ్మెల్యే ప్రభాకర్ వినతిపత్రంలో పేర్కొన్నారు.
సంగారెడ్డి మండలం కలబ్‌గూర్ గ్రామం, సదాశివపేట మండలం నందికండిలోని ప్రాచీన ఆలయాలను పరిరక్షించి, అభివృద్ధిపర్చి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దండి. నందికండి దేవాలయం 11వ శతాబ్దానికి చెందిన చారిత్రక, శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే అరుదైన కట్టడం. భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) సంరక్షణలో ఉన్న చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందింది. దేశం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు, చరిత్ర పరిశోధకులు, వారసత్వ సంపదపై ఆసక్తి ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. వీటిని అభివృద్ధి చేస్తే రాష్ట్ర సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక పర్యాటకానికి, ప్రాంతీయ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి విశేషంగా దోహదపడుతుంది అని చింతా ప్రభాకర్ తెలియజేశారు. భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)తో పాటు సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసి పనులను ప్రాధాన్య క్రమంలో చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు.
కేంద్రమంత్రికి తెలిపిన పనుల వివరాలు..
- ప్రాచీన దేవాలయాల పరిరక్షణ, పునరుద్ధరణ పనులు చేపట్టడం
- దేవాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం
- దేవాలయాలకు చేరుకునే రహదారులు, పార్కింగ్ సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, సుందరీకరణ పనులు చేపట్టడం
- దేవాలయ చరిత్రను వివరించే సమాచార బోర్డులు, పర్యాటక మార్గదర్శక సూచికలను ఏర్పాటు చేయడం
- కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని వారసత్వ, ఆధ్యాత్మిక పర్యాటక పథకాల కింద ఈ దేవాలయాలను ప్రోత్సహించడం
- ఈ చారిత్రక దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేయడం
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శివకుమార్, భాస్కర్ కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- ●KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..
- ●CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు
- ●Rakul Preet Singh | సినిమా బడ్జెట్ 1100 కోట్లు - రకుల్ రెమ్యూనరేషన్ కోటి
- ●Special Traffic Bureau | ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్.. తెరపైకి ప్రత్యేక బ్యూరో

Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..

CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు




