త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shambipur Raju | మ‌ల్లారెడ్డి స్టేట్‌మెంట్ నిన్న‌నే చూశా.. పార్టీకి దూర‌మైత‌డ‌ని అనిపిస్త‌లే

Shambipur Raju | మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేట్‌మెంట్ నిన్న‌నే చూశాన‌ని.. ఆయ‌న పార్టీకి దూర‌మైత‌డ‌ని అనిపిస్త‌లేద‌ని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్కొన్నారు. ఆయ‌న‌ వివిధ కారణాలతో యువ సంగ్రామ సదస్సుకు హాజరు కాలేద‌న్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నార‌ని వెల్ల‌డించారు.

S

Telangana | Published On Jul 23, 2026, 3.29 pm IST

Shambipur Raju | మ‌ల్లారెడ్డి స్టేట్‌మెంట్ నిన్న‌నే చూశా.. పార్టీకి దూర‌మైత‌డ‌ని అనిపిస్త‌లే
Advertisement
  • ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Shambipur Raju | త్రినేత్ర‌.న్యూస్‌: మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేట్‌మెంట్ నిన్న‌నే చూశాన‌ని.. ఆయ‌న పార్టీకి దూర‌మైత‌డ‌ని అనిపిస్త‌లేద‌ని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్కొన్నారు. ఆయ‌న‌ వివిధ కారణాలతో యువ సంగ్రామ సదస్సుకు హాజరు కాలేద‌న్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నార‌ని వెల్ల‌డించారు. రేపు కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్క‌లు నాటేందుకు పిలుపునిస్తున్నామ‌ని చెప్పారు. ఈమేర‌కు గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు.

రేపు మా నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. పుట్టినరోజు సందర్భంగా గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేశాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నాం. ఢిల్లీలో జరిగిన దాష్టీకానికి నిరసనగా రేపు ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్‌వీ (BRSV) నిరసన కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టింది. ఉదయం 10 గంటలకు జ‌రిగే ఈ నిరసన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు అని ఎమ్మెల్సీ తెలిపారు.

యువ సంగ్రామ సదస్సుకు వివిధ కారణాలతో మల్లారెడ్డి హాజరు కాలేదు. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మల్లారెడ్డి స్టేట్‌మెంట్ నిన్ననే చూశాను. ఆయన బీఆర్ఎస్‌లోనే ఉంటానని అన్నారు. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతారని మేం అనుకోవడం లేదు అని శంభీపూర్ రాజు పేర్కొన్నారు.

ఈ మీడియా స‌మావేశంలో బీఆర్ఎస్ఎల్పీ విప్ కె.పి. వివేకానంద పాల్గొన్నారు.

Advertisement
Advertisement