Ramchandar Rao | తెలంగాణ బిల్లు విషయంలో నేనే సమన్వయం చేశాను
Ramchandar Rao | తెలంగాణ బిల్లుకు సంబంధించిన ప్రక్రియలో నేను ప్రత్యక్షంగా భాగస్వామిని అయ్యానని.. బిల్లు పార్లమెంట్‌కు వెళ్లే ముందు జరిగిన కీలక సంప్రదింపుల్లో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. బిల్లు పాస్ కావడానికి బీజేపీ పూర్తిస్థాయిలో సహకరించిందని.. ఇది చరిత్రలో నమోదైన సత్యమని పేర్కొన్నారు.
- కీలక సంప్రదింపుల్లో ప్రత్యక్ష భాగస్వామిని
- బిల్లు కాపీ పట్టుకొని బీజేపీ నాయకత్వానికి వివరించా
- రాష్ట్ర ఏర్పాటులో ఎలాంటి అభ్యంతరాలు చెప్పొద్దని అరుణ్‌జైట్లీ సూచించారు
- ఎటువంటి షరతులు లేకుండా తెలంగాణకు మద్దతిచ్చాం
- ఇది చరిత్రలో నమోదైన వాస్తవం
- మా పాత్రను ఎవరూ మరవలేరు
- పవన్ కల్యాణ్ ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు
- కానీ.. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ఫాలో అయ్యింది
- మీట్ ది ప్రెస్‌లో బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు వ్యాఖ్యలు
Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ బిల్లుకు సంబంధించిన ప్రక్రియలో నేను ప్రత్యక్షంగా భాగస్వామిని అయ్యానని.. బిల్లు పార్లమెంట్‌కు వెళ్లే ముందు జరిగిన కీలక సంప్రదింపుల్లో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. సోమాజిగూడలో జరిగిన మీట్ ది ప్రెస్ లో గురువారం ఆయన మాట్లాడారు. తెలంగాణ బిల్లు ఆమోదం కోసం తానే స్వయంగా ఢిల్లీలో సమన్వయం చేశానన్నారు. బిల్లు పాస్ కావడానికి బీజేపీ పూర్తిస్థాయిలో సహకరించిందని.. ఇది చరిత్రలో నమోదైన సత్యమని పేర్కొన్నారు.
రాష్ట్ర సాధన కోసం తెరవెనుక ఎంతో కీలకంగా పనిచేశామని గుర్తు చేశారు. ప్రకాశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డితో కలిసి బిల్లును పరిశీలించి అనేక సూచనలు చేశాం. తెలంగాణ బిల్లు పాస్ కావడానికి బీజేపీ పూర్తి స్థాయిలో సహకరించింది. ఇది చరిత్రలో నమోదైన సత్యం. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు నిరంతరం కొనసాగేందుకు ప్రత్యక్షంగా కృషి చేశాను. రాష్ట్ర సాధనలో బీజేపీ పాత్రను ఎవరూ విస్మరించలేరు. అది చరిత్రలో నమోదైన వాస్తవం
బీజేపీ మొదటి నుంచే నమ్మింది..
చిన్న రాష్ట్రాలే సమర్థ పరిపాలనకు మార్గమని బీజేపీ మొదటి నుంచే నమ్మింది. తెలంగాణకు అదే ఆలోచనతో మద్దతిచ్చాం. కాంగ్రెస్ తెలంగాణ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబించింది. బీజేపీ మాత్రం ఎప్పుడూ మాట మార్చలేదు. తెలంగాణ బిల్లుకు బీజేపీ ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా మద్దతు ఇచ్చింది. పెప్పర్ స్ప్రే ఘటనతో పార్లమెంట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ తెలంగాణ బిల్లుపై మా మద్దతు వెనక్కి తీసుకోలేదు అని ఆయన గుర్తు చేశారు.
అప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు లేరు..
తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన కీలక సమయంలో TRS ఎంపీలు సభలో లేరు. తెలంగాణ బిల్లు ఆమోదం వెనుక బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తి రాజకీయ సంకల్పం ఉంది. తెలంగాణ బిల్లు కాపీతో నేను స్వయంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీని, బీజేపీ అగ్రనేతలను కలిసి వివరించాను. సీనియర్ న్యాయవాదులు ప్రకాశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డితో కలిసి అరుణ్ జైట్లీని కలిశాను. అదేవిధంగా తెలంగాణ బిల్లును పూర్తిగా అధ్యయనం చేసి మా బీజేపీ జాతీయ నాయకత్వానికి స్వయంగా వివరించాను. బిల్లుపై అభ్యంతరాలు చెప్పొద్దు.. ముందుగా తెలంగాణ రాష్ట్రం రావాలి’ అని అరుణ్ జైట్లీ సూచించారు అని రాంచందర్‌రావు స్పష్టం చేశారు.
రాత్రంతా కూర్చొని చర్చించిన రోజులున్నయ్..
అవసరమైన సవరణలపై BJP జాతీయ నాయకత్వంతో విస్తృతంగా చర్చలు జరిపాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై రాత్రంతా కూర్చుని చర్చించిన సందర్భాలు ఉన్నాయి. సుష్మా స్వరాజ్ తెలంగాణ ఆకాంక్షలకు బహిరంగంగా అండగా నిలిచి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ కోసం విమర్శలు, రాజకీయ దాడులు ఎదురైనా బీజేపీ నాయకత్వం వెనక్కి తగ్గలేదు. పార్లమెంట్‌లో బీజేపీ సభ్యులందరూ తెలంగాణ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం రావడంలో బీజేపీ నిబద్ధత, చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం కీలక పాత్ర పోషించాయి. తెలంగాణ ఇచ్చామని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ తెలంగాణ బిల్లు పాస్ కావడంలో బీజేపీ పాత్రను ఎవరూ మర్చిపోలేరు అని ఆ పార్టీ చీఫ్ రాంచందర్‌రావు పేర్కొన్నారు.
పవన్ ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలే..
పవన్ కల్యాణ్ ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ మంత్రి ‘తెలంగాణ తన జాగీరు’ అన్నట్లుగా విన్నాను. దానికి సమాధానంగానే సదరు వ్యక్తి ‘తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల జాగీరు’ అని అన్నారు. తెలంగాణలో మీటింగ్ పెట్టుకుంటానంటే మీరు అనవసరంగా మీరు రియాక్ట్ అవుతున్నరు. మేం ఎప్పుడూ స్పందించలే అని రాంచందర్‌రావు అన్నారు.
సంబంధిత వార్తలు

Ramchander Rao | పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు: రామచందర్ రావు
జూన్ 4, 2026

RS Praveen Kumar | రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు.. రెండు వర్గాలుగా రెవెన్యూ యంత్రాంగం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
జూన్ 4, 2026

Tenth Exams | రేపట్నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు..
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Gemma 4 12B | ల్యాప్‌టాప్‌ల కోసం గూగుల్ కొత్త ఏఐ టూల్.. కంప్యూటర్ లోపల ఉండి పనిచేస్తుంది..
- ●Ramchander Rao | పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు: రామచందర్ రావు
- ●RS Praveen Kumar | రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు.. రెండు వర్గాలుగా రెవెన్యూ యంత్రాంగం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Fire accident | మైత్రివనంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
- ●Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు అస్వస్థత..!
- ●Mutual Funds | గత 10 ఏళ్లలో SIP విధానంలో భారీ రిటర్న్స్‌ను ఇచ్చిన టాప్ 5 మ్యుచువల్ ఫండ్స్ ఇవే..

Gemma 4 12B | ల్యాప్‌టాప్‌ల కోసం గూగుల్ కొత్త ఏఐ టూల్.. కంప్యూటర్ లోపల ఉండి పనిచేస్తుంది..

Ramchander Rao | పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు: రామచందర్ రావు

RS Praveen Kumar | రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు.. రెండు వర్గాలుగా రెవెన్యూ యంత్రాంగం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Fire accident | మైత్రివనంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు



