Kavitha | మీ ఆశీర్వాదం కోసం వచ్చా.. హెచ్ఎంఎస్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపించండి
Kavitha | నాకు ప్రాణప్రదమైన సింగరేణి కార్మికులను కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చానని, హెచ్ఎంఎస్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపించాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కోరారు. నేను కార్మికుల పక్షాన నిలబడితే ఓ గుంటనక్క కాంట్రక్టర్ల పక్షాన ఉందని దుయ్యబట్టారు.
- నేనెప్పుడూ మీ పక్షానే నిలబడ్డా.. కానీ ఓ గుంటనక్క కాంట్రక్టర్ల వెంట ఉంది
- సింగరేణిలో బ్రిటిష్ పాలన నడుస్తోంది
- అవకాశం ఇస్తే మార్పు తెచ్చి చూపిస్తం
- యూనియన్లు, ప్రతిపక్షాలు ప్రశ్నించి వదిలేస్తాయి.. కానీ మేం ప్రశ్నించు, పోరాడు, పరిష్కరించు అనే విధానంతో వెళ్తున్నాం
- ఆఫీసర్లమో వాళ్ల హక్కుల కోసం నిన్న ధర్నా చేశారంట.. కార్మికులు చేస్తే మాత్రం మెమోలు ఇస్తున్నారు
- మళ్లీ హీహెచ్డీ పూర్తి స్థాయిలో తీసుకొచ్చే పూచీ నాది
- రామగుండం ఓసీపీ -3 సందర్శనలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
Kavitha | త్రినేత్ర.న్యూస్: నాకు ప్రాణప్రదమైన సింగరేణి కార్మికులను కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చానని, హెచ్ఎంఎస్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపించాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కోరారు. సింగరేణి బాయిబాటలో భాగంగా రామగుండం ఓసీపీ -3, బేస్ వర్క్ షాప్‌లను గురువారం ఆమె సందర్శించి కార్మికులతో మాట్లాడి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. నేను కార్మికుల పక్షాన నిలబడితే ఓ గుంటనక్క కాంట్రక్టర్ల పక్షాన ఉందని దుయ్యబట్టారు. అవకాశం ఇస్తే మార్పు తెచ్చి చూపిస్తామని పేర్కొన్నారు.

ప్రశ్నించు, పోరాడు, పరిష్కరించు అనే విధానంతో వెళ్తున్నాం..
బాయిబాట కార్యక్రమం ద్వారా కార్మికులను కలిసి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీకు నేను 20 ఏళ్లుగా తెలుసు. ఉద్యమంలోనూ అదే విధంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ మీతే పాటు పని చేశాను. నేను ఎప్పుడూ కూడా కార్మికుల పక్షానే ఉన్నాను. కానీ ఒక గుంటనక్క కాంట్రాక్టర్ల పక్షాన ఉంది. ఎప్పుడూ కూడా నేను కార్మికుల కోసమే పని చేస్తాను. నేను ఎంత మొండి దాన్నో మీకు తెలుసు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి ఏ ప్రతిపక్షం చేయనన్ని పోరాటాలు మేం చేస్తున్నాం. యూనియన్లు, ప్రతిపక్షాలు ప్రశ్నించి వదిలేస్తాయి. కానీ మేం ప్రశ్నించు, పోరాడు, పరిష్కరించు అనే విధానంతో వెళ్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో సమస్యలను ఈ విధంగా పరిష్కరించాం అని కవిత చెప్పారు.

పార్టీ పాంచజన్యం అనే ఐదు కీలక అంశాలతో ముందుకు వెళ్తోంది. ఉచిత విద్య, వైద్యం, సామాజిక న్యాయం, రైతుకు గౌరవం, యువత ఉపాధి, రుణాలు ఇవ్వాలనే సంకల్పం పెట్టుకున్నాం. కచ్చితంగా మాకు అవకాశం ఇస్తే మంచి మార్పు తెస్తాం. రేవంత్ రెడ్డి చెప్పిన మార్పు మాత్రం కాదు. ప్రజల కోసం మంచి మార్పు కచ్చితంగా తెస్తాం. అందులో సింగరేణిలో హెచ్ఎంఎస్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నా. ఆఫీసర్లమో వాళ్ల హక్కుల కోసం నిన్న ధర్నా చేశారంట. అదే కార్మికులు ధర్నా చేస్తే మాత్రం మెమోలు ఇస్తున్నారు. ఇది సరికాదు. ఆఫీసర్లు, ప్రభుత్వం తీరు మారాలి అని ఆమె ఆవేదన చెందారు.
కార్మికులకు క్షమాపణ చెబుతున్నా..
నేను టీజీబీకేఎస్‌లో ఉన్నప్పుడే ప్లే డే, ఎన్ మైనస్ పద్ధతి, హీహెచ్డీలో 50 శాతం ఇచ్చే విధానం వచ్చింది. దీని కారణంగా కార్మికులు 2 నుంచి 3 లక్షల వరకు నష్టపోతున్నారని తెలిసింది. కార్మికులకు ఇంత నష్టం జరుగుతుందని అప్పుడు మాకు తెలియదు. మా కారణంగా జరిగిన తప్పునకు కార్మికులకు క్షమాపణ చెబుతున్నా. కచ్చితంగా జరిగిన తప్పులను సవరించుకుంటాం. ఆత్మ పరిశీలన చేసుకుంటాం. మళ్లీ హీహెచ్డీ పూర్తిస్తాయిలో వచ్చే హక్కును మీకు తెచ్చి పెడతానని మాట ఇస్తున్నా అని టీఆర్ఎస్ చీఫ్ పేర్కొన్నారు.

సింగరేణిలో ఇప్పటికీ బ్రిటిష్ పాలన నడుస్తోంది. కార్మికులను వేధిస్తూ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. ఆత్మపరిశీలన చేసుకొని కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ నుంచి పంపిస్తే ప్రజల కోసం పార్టీ పెట్టాను. మేనేజ్ మెంట్ ఒత్తిడితో కార్మికులు ఆందోళనతో ఉన్నారు. మెడికల్ స్కీమ్ అందరికీ ఒకేలా వర్తించాలని కోరుతున్నా. ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం ఉండొద్దు. మెడికల్ స్కీమ్ పారదర్శకంగా అమలు చేయాలి. సింగరేణి కార్మికుల నుంచి రిఫరల్ హాస్పిటల్స్ డబ్బులు వసూలు చేయకుండా చూడాలి. ఒకప్పుడు సింగరేణి కార్మికుల కోసం మంచి స్కూల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు స్టాఫ్ లేదు. కొన్నేళ్లుగా ప్రభుత్వాల విధానాల కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. సింగరేణి కార్మికులు కూడా విద్య, వైద్యం కోసం భారీగా ఖర్చు చేసే పరిస్థితి తెచ్చారు. ఇక అలియాస్ పేర్లకు సంబంధించి చాలా ఇబ్బంది పెడుతూ విజిలెన్స్ కేసులు పెడుతున్నారు. గతంలో మేం అలియాస్ పేర్ల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించాలని యాజమాన్యానికి చెప్పి ఎంతో మందికి మేలు చేశాం. కానీ ఉద్యోగాలు ఇవ్వవద్దన్న కారణంతో అలియాస్ పేర్ల విషయంలో విజిలెన్స్ కేసులు పెడుతున్నారు. టెన్త్ పాస్ అంటూ కొర్రీలు పెడుతున్నారు. సింగరేణి కార్మికులకు చదువు ప్రామాణికం కాదు. కానీ ఉద్యోగాలు ఇవ్వొద్దన్న కారణంతో ఇవన్నీ చేస్తున్నారు అని ఆమె విమర్శించారు.
సింగరేణి భవన్ ముట్టడిస్తే మెడికల్ బోర్డు పెట్టారు..
డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటి వరకు కూడా 2 వేల మందికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. నాలుగు నెలల క్రితం మేం హైదరాబాద్‌లో సింగరేణి భవన్‌ను ముట్టడిస్తే మెడికల్ బోర్డు పెట్టారు. కానీ దాని వల్ల కూడా ఎవరికీ ప్రయోజనం లేకుండా పోయింది. కచ్చితంగా నెలకు రెండుసార్లు సింగరేణి మెడికల్ బోర్డును నిర్వహించాలి. నాలుగైదు నెలల్లో రిటైర్‌మెంట్ అవుతున్న వాళ్లు డిపెండెంట్ ఉద్యోగం కోసం టెన్షన్ పడవద్దు. హెచ్ఎంఎస్ గెలిచిన వెంటనే మీ అప్లికేషన్ డేట్‌ను ప్రామాణికం చేసేలా చేస్తాం అని కవిత తెలిపారు.
ఓపెన్ కాస్ట్ గనులను సింగరేణీయే నిర్వహించాలి..
సింగరేణలో ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైనింగ్ రెండు ఉండాలనే పాలసీ మాకు ఉంది. ఇక్కడ ఓసీ-3 మన సంస్థ ఆధ్వర్యంలో నడవటం కారణంగానే ఇక్కడ ఎక్కువ మంది పర్మినెంట్ ఎంప్లాయిస్ ఉన్నారు. అదే ప్రైవేట్ వాళ్లు నిర్వహించే మైనింగ్‌లో ఎక్కువ మంది కాంట్రాక్ట్ కార్మికులే ఉంటారు. ఫ్యూచర్‌లో ఓపెన్ కాస్ట్ గనులను కూడా సింగరేణియే నిర్వహించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి వరకు అండర్ గ్రౌండ్ మైనింగ్ కార్మికులను కలిశాం. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ కార్మికులను కలుస్తున్నాం. వాళ్ల బాధలు వాళ్లకుంటే మీ బాధలు మీకు ఉన్నాయి. ముఖ్యంగా ఈపీ ఆపరేటర్లకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రమోషన్ల కోసం వాళ్లు 12 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా వాళ్లు రిక్రూట్ అయ్యేప్పుడే బీ గ్రేడ్ విధానంలో రిక్రూట్ చేసుకుంటే వాళ్లకు మేలు జరుగుతుంది అని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
ఓపెన్ కాస్ట్‌లో దుమ్ము సమస్య ఉంది..
ఇక వాళ్లు నడిపే వెహికిల్స్ నాసిరకంగా ఉంటున్నాయి. దీంతో ఆపరేటర్లు ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో ఒక ఈపీ ఆపరేటర్ ఇప్పటికీ కూడా కోమాలో ఉన్నారు. వాళ్లు చేసేది హైరిస్క్ జాబ్. అందుకే వారి భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓపెన్ కాస్ట్‌లో దుమ్ము సమస్య ఉంది. వాటర్ ట్యాంకర్లతో నీళ్లు కొట్టాల్సిన ఉన్నా పట్టించుకోవటం లేదు. వాటర్ ట్యాంకర్లను యూనియన్ లీడర్లు నిర్వహిస్తుండటంతో వాళ్లు సరిగా పనిచేయటం లేదు. కానీ హెచ్ఎంఎస్ గెలిస్తే అలా ఉండదు. మా నాయకులు కార్మికులతో కలిసి పనిచేస్తారు. యూనియన్ లీడర్లు అయ్యామని పని వదిలే ప్రసక్తే ఉండదు అని కవిత తేల్చి చెప్పారు.
తిలక్‌నగర్‌లో వెళ్లి సింగరేణి కార్మికుల క్వార్టర్స్ చూశాను. చాలా చిన్నగా ఉన్నాయి. పక్కన ఒక షెడ్ వేసుకుంటే వాటిని కూడా తొలగిస్తున్నారు. సింగరేణిలో 80 వేల క్వార్టర్స్ ఉంటే 40 వేల కార్మికులే ఉన్నారు. మిగిలిన ఉన్న క్వార్టర్స్ ను డబుల్ బెడ్ మాదిరిగా చేసి కార్మికులకు ఇవ్వాలి. లేదంటే వాళ్లు వేసుకున్న షెడ్ జోలికి వెళ్లకుండా మానవత్వంతో వ్యవహరించాలి అని కవిత సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●OU Students | ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●NABARD Telangana | తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు: రైతుల ఆదాయం పెంచేందుకు నాబార్డ్ 'క్లైమేట్ స్మార్ట్' ప్లాన్!
- ●Stamps and Registration services | రిజిస్ట్రేషన్ సేవలకు సెలవ్.. ఏయే తేదీల్లో అంటే
- ●CM Revanth Reddy | ఫ్యూచర్ లేనోడళ్ల ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాడట.. హరీశ్‌రావుపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్
- ●Telangana | రైతులకు పిడుగులాంటి వార్త.. పాత పద్ధతిలో పంట కొనుగోళ్లకు ఇక నుంచి స్వస్తి

OU Students | ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

NABARD Telangana | తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు: రైతుల ఆదాయం పెంచేందుకు నాబార్డ్ 'క్లైమేట్ స్మార్ట్' ప్లాన్!

Stamps and Registration services | రిజిస్ట్రేషన్ సేవలకు సెలవ్.. ఏయే తేదీల్లో అంటే



