త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kaushik Reddy | ఆ ఆరోప‌ణ‌ల‌ను నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఐపీఎస్ అసోసియేష‌న్‌కు కౌశిక్‌రెడ్డి కౌంట‌ర్‌..!

Kaushik Reddy | క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్‌పై మ‌త మార్పిడి ఆరోప‌ణ‌లు చేయ‌లేద‌ని.. తాను అన్న‌ట్లుగా నిరూపిస్తే రాజీనామా చేస్తాన‌ని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఐపీఎస్ అసోసియేష‌న్ చేసిన ఆరోప‌ణ‌ల్లో ఏమాత్రం నిజం లేద‌న్నారు.

P

Telangana | Published On Jan 31, 2026, 6.06 pm IST

Kaushik Reddy | ఆ ఆరోప‌ణ‌ల‌ను నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఐపీఎస్ అసోసియేష‌న్‌కు కౌశిక్‌రెడ్డి కౌంట‌ర్‌..!
Advertisement

Kaushik Reddy | క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్‌పై మ‌త మార్పిడి ఆరోప‌ణ‌లు చేయ‌లేద‌ని.. తాను అన్న‌ట్లుగా నిరూపిస్తే రాజీనామా చేస్తాన‌ని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఐపీఎస్ అసోసియేష‌న్ చేసిన ఆరోప‌ణ‌ల్లో ఏమాత్రం నిజం లేద‌న్నారు. సీపీపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ఐపీఎస్ అసోసియేష‌న్ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా వీడియోను విడుద‌ల చేశారు. సీపీపై తాను మ‌త మార్పి ఆరోప‌ణ‌లు చేయ‌లేద‌న్నారు. ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్ త‌న‌కు క్షమాపణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. లేక‌పోతే ప్రివిలేజ్‌ మోషన్ వేస్తాన‌ని హుజూరాబాద్ ఎమ్మెల్యే హెచ్చ‌రించారు. ఇటీవ‌ల క‌రీంన‌గ‌ర్ జిల్లా వీణ‌వంక స‌మ్మ‌క్క సారాల‌మ్మ జాత‌ర‌కు వెళ్తున్న స‌మ‌యంలో పోలీసులు పాడి కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో వెళ్తున్న స‌మ‌యంలో పోలీసులు త‌మ‌ను అడ్డుకున్నార‌ని ఆరోపిస్తూ ఆయ‌న రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల వ్య‌వ‌హార శైలిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, కరీంనగర్‌ సీపీపై మ‌తప‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని ఐపీఎస్ అధికారుల సంఘం ఆరోపించింది. వెంట‌నే సీపీ గౌస్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని.. లేక‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది. తాజాగా అధికారుల సంఘం చేసిన ఆరోప‌ణ‌లు నిరాధార‌మ‌ని కొట్టిప‌డేశారు.

https://x.com/i/status/2017517312426054066

Advertisement

తాజావార్తలు

Advertisement