Medaram | మండమేలిగే పండు.. మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు
Medaram | తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహా జాతరకు (Medaram Maha Jatara) సమయం దగ్గరపడుతున్నది. దీంతో మేడారం (Medaram) భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క-సారలమ్మ జాతరలో బుధవారం అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది.
త్రినేత్ర.న్యూస్: తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహా జాతరకు (Medaram Maha Jatara) సమయం దగ్గరపడుతున్నది. దీంతో మేడారం (Medaram) భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క-సారలమ్మ జాతరలో బుధవారం అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆదివాదీ సంప్రదాయాల ప్రకారం మండమేలిగే పండుగతో (Manda Melige) జాతర పూజా కార్యక్రమాలు మొదలు కానున్నాయి. వనదేవతల వారంగా భావించే బుధవారం రోజున మేడారం, కన్నపల్లి, కొండాయి, పూనుగుండ్లలో జాతరకు శ్రీకారం చుడతారు. ఈ నాలుగు ప్రాంతాల్లోనూ వనదేవత పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ జాతర లాంఛనంగా మొదలవుతుంది. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే సమ్మక్క, సారలమ్మ గద్దెలను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు.
ఈ పండుగలో భాగంగా పూజారులు మేడారంలోని సమ్మక్క గుడిని, కన్నెపల్లిలోని సారలమ్చ గుడి, ఏటూరునాగారం మండలంలోని కొండాయిలో ఉన్న గొవిందరాజుల గుడిని సాంప్రదాయ బద్దంగా శుద్ధి చేస్తారు. అనంతరం ఆదివాసీల ఆచార, సంప్రదాయ పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పండుగ ప్రత్యేకతలు..
ఆసియాలో రెండో అతిపెద్దదైన గిరిజన జాతర ప్రారంభానికి ముందు ఆదివాసీ పూజారులు నిర్వహించే అత్యంత పవిత్రమైన కార్యక్రమమే మండమేలిగే పండుగ. మేడారంలోని సమ్మక్క ప్రధాన ఆలయాన్ని, అలాగే కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. అత్యంత రహస్యంగా ప్రత్యేక ఆచారాలతో పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయంలోకి సామాన్యులను అనుమతించరు. ఈ సందర్భంగా డోలు వాయిద్యాల నడుమ పూజారులు, గ్రామస్థులు దిష్టి తోరణాలను కట్టి గ్రామాన్నంతా అష్టదిగ్బంధనం చేస్తారు. నేటి నుంచి జాతర ముగిసే వరకు కోయ పూజారులు కఠినమైన నియమాలను, ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు.
మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగురోజులపాటు జరుగనుంది. రెండేండ్లకు ఒక్కసారి జరిగే ఈ జాతరలో తొలిరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజు, ఏటూరునాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజుల ఆగమనం ఉంటుంది. రెండో రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తరలిరానుంది. ఇక మూడోరోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తల పూజలు అందుకుంటారు. నాలుగో రోజు తల్లుల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






