Revanth Reddy | మేడారంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం.. మనవడితో కలిసి మొక్కులు చెల్లించుకున్న రేవంత్.. ఫొటోలు
Revanth Reddy | మేడారంలో (Medaram) ఆదివాసీ సంస్కృతి ఉట్టి పడేలా పునఃనిర్మించిన సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) భక్తులకు అంకితం చేశారు. వనదేవతల గద్దెలు, ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
త్రినేత్ర.న్యూస్: మేడారంలో (Medaram) ఆదివాసీ సంస్కృతి ఉట్టి పడేలా పునఃనిర్మించిన సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) భక్తులకు అంకితం చేశారు. వనదేవతల గద్దెలు, ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించారు. మంత్రులతో కలిసి గద్దెల పైలాన్‌ను ఆవిష్కరించారు. కుటుంబ సమేతంగా వణదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. దీంతో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతరను (Medaram Jatara) లాంఛనంగా ప్రారంభించినట్లయింది. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.

ఆదివారం రాత్రి మేడారంలో బస చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. సోమవారం ఉదయం ఆలయ అభివృద్ది పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పునర్నిర్మాణం చేసిన ఆలయంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని ప్రారంభించారు. తొలుత అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సమేతంగా వన దేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

రాతిశిలలతో అభివృద్ధి పనులకు ప్రాణం పోయగా, 4 వేల టన్నుల గ్రానైట్‌పై ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలియజేసేలా 7 వేల చిత్రాలను అందంగా చిత్రీకరించారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర, పునర్నిర్మాణ నిర్మాణ పనులు ఆదివాసీల మూలాలు జాతర చరిత్రను కళ్లకు కట్టినట్టుగా నిర్మాణాలు చేపట్టారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీటవేస్తూ చరిత్రను వందల ఏండ్లు చెక్కు చెదరకుండా పనులు పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



