N Ramchander Rao | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హిందువులకు రక్షణ కరువు
N Ramchander Rao | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హిందువులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు ఆరోపించారు. శనివారం రాత్రి ఆలయంలో మలమూత్రాలను విసర్జించాడు. ఈ క్రమంలో ఆయన ఆలయాన్ని ఆదివారం సందర్శించారు.
- హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తిని ఎన్‌కౌంటర్ చేయాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు డిమాండ్
N Ramchander Rao | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హిందువులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు ఆరోపించారు. శనివారం రాత్రి సఫిల్‌గూడ కట్ట మైసమ్మ ఆలయంలో ఓ వ్యక్తి మలమూత్రాలను విసర్జించాడు. ఈ క్రమంలో ఆయన ఆదివారం ఆలయాన్ని సందర్శించారు. అమానుష ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం యువకుడు దేవీ ఆలయాన్ని అవమానపరిచేలా ఉందన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగానే చేసిన ఘటనలా సీసీటీవీ ఫుటేజీతో తెలుస్తుందన్నారు. గతకొంతకాలంగా హిందూ దేవీదేవతలను అవమానించే ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపించారు.
పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశామని, అతనికి మతిస్థిమితం లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు జరుగడం కొత్తేం కాదని.. గతంలో కీసరలోనూ ఆంజనేయస్వామి విగ్రహాన్ని, ముత్యాలమ్మ ఆలయంలోనూ విగ్రహాన్ని ధ్వంసం చేశారని గుర్తు చేశారు. హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన మండిపడ్డారు. కొందరు వ్యక్తులు రాజకీయ అండదండలతో ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఘటనలు పెరిగాయని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక హిందువులు ఈ రాష్ట్రంలో సురక్షితంగా లేరన్నారు. ఇలాంటి వ్యక్తులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. పోలీసులు సదరు వ్యక్తికి మతిస్థిమితం లేదని చెబుతున్నారని.. పిచ్చివాడని చెప్పడం కుదరదన్నారు.
తాను మానవహక్కులను గౌరవించే వ్యక్తిని తెలిపారు. ఇలాంటి పనులు చేసి మనోభావాలను దెబ్బతీస్తే, మతసామరస్యాన్ని దెబ్బతీసే ఇలాంటి వ్యక్తులను ఎన్‌కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలను ఆపేందుకు ఇదొకటే ఇదొకటే మార్గమన్నారు. లేకపోతే ఇలాంటి పనులు ఏమాత్రం ఆగవన్నారు. ఈ ఘటనలను అరికట్టాల్సిన బాధ్యతపై ప్రభుత్వంపై ఉందన్నారు. హోంమంత్రిత్వశాఖ ఉన్నదే సీఎం రేవంత్‌రెడ్డి వద్ద అని గుర్తు చేసిన బీజేపీ నేత.. మరి శాంతిభద్రతలు ఏమవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హిందువులకు రక్షణ లేకుపోతోందని, గతంలో కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో హిందు దేవాలయాలపై దాడులు జరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ఘటనలను బీజేపీ ఖంటిస్తుందన్నారు. హైదరాబాద్‌లో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు చాలా మంది అక్రమంగా ఉంటున్నారని.. వారందరినీ ఎరిపారేయాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





