High Court | జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక.. కేసీఆర్, హరీశ్ రావుకు ఊరట
High Court | జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghose Commission) నివేదిక అంశంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్ రావుకు (Harish Rao) ఊరట లభించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు (High Court) ఆదేశించింది.
High Court | త్రినేత్ర.న్యూస్: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh Commission) నివేదిక అంశంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్ రావుకు (Harish Rao) ఊరట లభించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు (High Court) ఆదేశించింది. కమిషన్ ఎలాంటి నిబంధను పాటించలేదని పేర్కొంటూ రిపోర్టును నిలిపివేసింది. అదే సమయంలో కమిషన్ నియామకం చట్టబద్దమే అని స్పష్టం చేసింది. కాళేశ్వరం నిర్మాణంలో అవకతవలు జరిగాయని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కేసీఆర్, హరీశ్ రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, ఐఏఎస్ మాజీ అధికారి ఎస్‌కే జోషి విడివిడిగా హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై సుదీర్ఘ విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా తుది తీర్పును వెల్లడించింది.
కాళేశ్వరం అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ 2024 మార్చి 14న ప్రభుత్వం జీవో 6ను విడుదల చేసింది. అయితే కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని, తమపై అభియోగాలు మోపే ముందు, తమ వాదనలను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు ఆరోపించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ సాగిందని కోర్టుకు విన్నవించారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్ వేశామంటూ మరొకరి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరికాదన్నారు.
మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్ వేసినట్లు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రికార్డుల ఆధారంగానే ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా పిటిషనర్లతోపాటు పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిందని.. కాబట్టి పిటిషన్‌లను కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మార్చి 12న తీర్పును వాయిదా వేసింది. అయితే ఏప్రిల్ 8న తీర్పు వెళ్లడించాల్సి ఉండగా.. ఈ నెల 22కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నది. తాజాగా కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దంటూ తీర్పును వెలువరించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



