Sabitha Indra Reddy | రేవంత్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే… భట్టికి సీఎం పదవి ఇవ్వాలి
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తనపై, మహిళా ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ భవన్‌లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత అంశాలు ప్రస్తావిస్తూ సమయాన్ని వృథా చేశారని, ఆయన అజెండా కేవలం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడమేనని సబితా ఇంద్రారెడ్డి విమర్శ
- మహిళా ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో జరిగిన అవమానంపై సీఎం క్షమాపణ చెప్పకపోగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం
- కేసీఆర్‌కు కేవలం 66 ఎకరాల ఫామ్‌హౌస్ మాత్రమే ఉందని రేవంత్ రెడ్డే స్వయంగా ఒప్పుకున్నారు
- పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు
- కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసు
- రేవంత్ రెడ్డి టార్గెట్ కేసీఆర్ కుటుంబమే
- మహిళా ఎమ్మెల్యేల అవమానంపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్
Sabitha Indra Reddy | త్రినేత్ర.న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వ్యక్తిగత అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన అజెండా కేవలం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం మాత్రమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో విలువైన సమయాన్ని వ్యక్తిగత విమర్శలతో వృథా చేస్తున్నారని మండిపడ్డారు.
మహిళా ఎమ్మెల్యేల పట్ల దుస్సాసనపర్వం
శాసనసభలో మహిళా ఎమ్మెల్యేలుగా తమకు తీవ్ర అవమానం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి కనీసం విచారం వ్యక్తం చేయలేదని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. "మేము కూడా ఆడబిడ్డలమే కదా? మా గురించి ఎందుకు మాట్లాడలేదు?" అని ప్రశ్నించారు. జాతీయ రహదారిపై నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులు పెడతారా అని నిలదీశారు. ఇది కలియుగ దుస్సాసనపర్వంలా ఉందని, 13 మంది ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు పెట్టించి సీఎం వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఆస్తుల వివాదంపై క్లారిటీ
కేసీఆర్ ఫామ్‌హౌస్ వెయ్యి ఎకరాలు అంటూ ఇంతకాలం దుష్ప్రచారం చేశారని, కానీ చివరికి ఆయనకు ఉన్నది కేవలం 66 ఎకరాల ఫామ్‌హౌస్ మాత్రమేనని రేవంత్ రెడ్డే ఒప్పుకున్నారని సబితా గుర్తుచేశారు. బీఆర్ఎస్ నాయకుల ఆస్తుల లిస్ట్ కావాలంటే తామే ఇచ్చేవాళ్లమని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లాలో రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ భూములు పోగు చేసుకున్నారో తమకు బాగా తెలుసని అన్నారు.
పార్టీ మారడంపై కౌంటర్
తాను తన భర్త ఇంద్రారెడ్డి మరణాంతరం 2000 సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరానని, మరి రేవంత్ రెడ్డి ఏ పార్టీలు మారలేదా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. కేసీఆర్ హయాంలో అమలైన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి గొప్ప పథకాలను రేవంత్ రెడ్డి ఎందుకు బంద్ పెట్టారని నిలదీశారు. సీఎం హోదాకు తగినట్లుగా ప్రవర్తించాలని, తన మనస్తత్వాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ ప్రెస్ మీట్‌లో సుమిత్రానంద్, హేమ, మమత, షకీలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Graduate MLC Elections Voters Schedule Release | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల
- ●Brahmotsavam | తిరుమలలో వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు.. సింహవాహనంపై మలయప్ప విహారం
- ●Amazon | అమెజాన్ భారీ డీల్.. జనరాక్ షేర్లు ఏకంగా 40 శాతం జంప్..
- ●Sri Meenakshi Sundareshwarar Temple | 17 ఏళ్ల తర్వాత అట్టహాసంగా మధురై మీనాక్షి ఆలయ మహా కుంభాభిషేకం.. భక్తకోటితో కిటకిటలాడిన ప్రాంగణం
- ●Tata Sons | టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్
- ●Defamation on Maheshkumar, Addhanki Dayakar | టీపీసీసీ చీఫ్, అద్దంకిపై పరువు నష్టం దావా వేసిన హరీశ్ రావు

Graduate MLC Elections Voters Schedule Release | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల

Brahmotsavam | తిరుమలలో వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు.. సింహవాహనంపై మలయప్ప విహారం

Amazon | అమెజాన్ భారీ డీల్.. జనరాక్ షేర్లు ఏకంగా 40 శాతం జంప్..

Sri Meenakshi Sundareshwarar Temple | 17 ఏళ్ల తర్వాత అట్టహాసంగా మధురై మీనాక్షి ఆలయ మహా కుంభాభిషేకం.. భక్తకోటితో కిటకిటలాడిన ప్రాంగణం



