Gollapalli Reservoir Protest | రేపటి హరీశ్‌రావుకు బహిరంగ సభకు అనుమతి రద్దు.. కాంగ్రెస్ ప్రభుత్వం పోకడలపై సింగిరెడ్డి ఫైర్..!
Gollapalli Reservoir Protest | వనపర్తి నియోజకవర్గం రేవల్లి మండలం గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా వంద రోజులుగా దీక్షలు చేస్తున్న రైతులకు మద్దతుగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ నెల 9న ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు రద్దు చేసింది.
Gollapalli Reservoir Protest | వనపర్తి నియోజకవర్గం రేవల్లి మండలం గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా వంద రోజులుగా దీక్షలు చేస్తున్న రైతులకు మద్దతుగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ నెల 9న ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు రద్దు చేసింది. కాంగ్రెస్ సర్కారు కొనసాగిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పరిగి రైతుల పరామర్శకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల అక్రమ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తొలుత సమావేశానికి అనుమతులు ఇచ్చి, అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత నేడు అనుమతులు రద్దు చేయడంపై మండిపడ్డారు.
ఏడు టీఎంసీల ఏదుల రిజర్వాయర్ ఉండగా పక్కనే గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి కాంగ్రెస్ సర్కార్ పూనుకుందని, కేవలం మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసమే తెరమీదకు వచ్చిన గొల్లపల్లి రిజర్వాయర్‌ను తెరపైకి తసుకువచ్చిందని ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పెండింగ్ పనులు పూర్తి చేస్తే నార్లాపూర్, ఏదులతో పాటు వట్టెం, కరివెనలో నీటిని నింపుకునే అవకాశం ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాలువల టెండర్లు రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్ ఆరోపించారు. చేయాల్సిన పనులు వదిలేసి, గొల్లపల్లి రిజర్వాయర్ ముందుకు వేసుకోవడంపై 100 రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్నారని, రైతులకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు రానున్న నేపథ్యంలో అనుమతులు ఇచ్చి రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. హైకోర్టుకు వెళ్లి సభకు అనుమతులు తెచ్చుకుంటామన్నారు. ప్రజల తరపున, రైతాంగం తరపున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదని, కేసులు, బెదిరింపులకు భయపడితే ఈ తెలంగాణ వచ్చేది కాదన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



