Harish Rao | మాటలు దంచుడు కాదు రేవంత్.. దమ్ముంటే ధరలు దించు.. సీఎం రేవంత్‌కు హరీశ్ రావు ఘాటు లేఖ..!
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యం చూడటం మానేసి, వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యం చూడటం మానేసి, వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయి. రాష్ట్ర పన్నులు తగ్గించాలి” అని నాడు పీసీసీ హోదాలో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, నేడు అధికారంలో ఉండి ఎందుకు వ్యాట్ తగ్గించడం లేదని నిలదీశారు. ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించి ధరలు దించాలని డిమాండ్ చేశారు. వారంలో నాలుగు సార్లు ఫ్యూయల్ ధరలు పెంచి కేంద్రం ప్రజలపై పెను భారం మోపుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించకపోవడం వల్ల ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన సాగు ఖర్చులతో రైతులు సతమతమవుతుంటే, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో “మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు” పరిస్థితి తయారైందన్నారు.
రవాణా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడంతో ద్రవ్యోల్బణం పెరిగి అన్ని వర్గాల ప్రజల జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల భారం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “రైతు పొలం దున్నాలన్నా డీజిల్ భారం.. సామాన్యుడు బైక్ తీయాలన్నా పెట్రోల్ భార ఆటో సోదరుడి బతుకు బండి నడవాలన్నా ఇంధన భారం” అంటూ పెరిగిన ధరలు ప్రజలకు పెను శాపంగా మారాయని హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ రేవంత్ ప్రభుత్వం వ్యాట్ రూపంలో ఖజానా నింపుకుంటూ సంబురపడుతుందని, పైశాచిక ఆనందం పొందుతుందన్నారు. పెరిగిన ధరలతో ప్రతి నెలా రూ.162 కోట్లు, ఏడాదికి దాదాపు రూ.2,000 కోట్ల అదనపు వ్యాట్ ఆదాయం వస్తున్నా ప్రజల సంక్షేమాన్ని విస్మరించి ప్రచారాలకే పెద్దపీట వేస్తోందని విమర్శించారు.
ఎన్నికల ముందు వ్యాట్‌పై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి, రెండున్నరేళ్లుగా కనీసం 0.1 శాతం కూడా తగ్గించకపోవడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఒక తీరు, అధికారంలోకి వచ్చాక మరో తీరు చూపుతూ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆరోపించారు. నిజంగా ప్రజా పాలనే అయితే వెంటనే పెట్రోల్, డీజిల్‌పై కనీసం 10 శాతం వ్యాట్ తగ్గించి ఉపశమనం కల్పించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్ పెంపుపై స్పందించాలని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యాట్ దోపిడీపై రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవాలని కోరారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు




