త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కేసీఆర్‌ది అభివృద్ధి అయితే.. రేవంత్‌ది విధ్వంసం: హ‌రీశ్ రావు

Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) జూనియ‌ర్ యోగి అయిపోయాడ‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు. రెండున్న‌రేండ్ల‌లో ఒక్క ఇళ్లు క‌ట్ట‌లేదు కానీ, ల‌క్ష ఇండ్లు కూల్చార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్‌ది అభివృద్ధి అయితే.. రేవంత్‌ది విధ్వంసమ‌ని మండిప‌డ్డారు.

G

Telangana | Published On Mar 15, 2026, 1.10 pm IST

Harish Rao | కేసీఆర్‌ది అభివృద్ధి అయితే.. రేవంత్‌ది విధ్వంసం: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) జూనియ‌ర్ యోగి అయిపోయాడ‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు. రెండున్న‌రేండ్ల‌లో ఒక్క ఇళ్లు క‌ట్ట‌లేదు కానీ, ల‌క్ష ఇండ్లు కూల్చార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్‌ది అభివృద్ధి అయితే.. రేవంత్‌ది విధ్వంసమ‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌లంతా ఇబ్బందుల్లో ఉన్నార‌ని మండిప‌డ్డారు. హైద‌రాబాద్‌లోని ముషీరాబాద్ భోల‌క్‌పూర్లో రంజాన్ తోఫా కార్య‌క్ర‌మంలో హ‌రీశ్ రావు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ సలీంతో క‌లిసి ముస్లిం మహిళలకు రేషన్ కిట్ అందజేశారు. అనంత‌రం మాట్లాడుతూ `కేసీఆర్ నిరుపేదల గురించి ఆలోచించి షాది ముబారక్ పథకంతో రూ.లక్ష అందించేవారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక షాది ముబారక్ అమలు కావడం లేదు. ఈ రెండున్నర సంవత్సరాలలో ఒక్క మంచి పనైనా చేశారా ?. ఇమామ్ మోజమ్ లకు వేతనం పెంచుతామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు. ఏ ఒక్కటి ఇవ్వలేదు.

రెండున్నర సంవత్సరాలలో ఒక్క ఇల్లు కట్టలేదు కానీ లక్ష ఇండ్లు కూల్చారు. రేవంత్ రెడ్డి జూనియర్ యోగి అయిపోయాడు. బుల్డోజర్లతో ఇండ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నాడు. కేసీఆర్‌ది అభివృద్ధి అయితే రేవంత్‌ది విధ్వంసం. కేసీఆర్ వచ్చాక మంచి నీటి ఇబ్బందులు పోయాయి. కాంగ్రెస్ వచ్చాక ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కిట్ ఎందుకు మాయమైంది. కరోనా సమయంలో కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకున్న నాయకుడు కేసీఆర్. మీ అందరి దయ వల్ల, అల్లా దయవల్ల కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. మళ్ళీ మంచి రోజులు రావాలి.

రంజాన్ నెల పవిత్ర మాసం. ఏదైనా కోరుకుంటే జరుగుతుంది. నేడు ప్రపంచమంతా యుద్ధ వాతావరణం ఉంది. సిలిండర్ దొరకడం లేదు. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ప్రజలందరి ఇబ్బందులు తొలిగిపోవాలని ప్రార్థించండి. మళ్లీ అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుందాం.` అని హ‌రీశ్ రావు అన్నారు.

Advertisement
Advertisement
Harish Rao | కేసీఆర్‌ది అభివృద్ధి అయితే.. రేవంత్‌ది విధ్వంసం: హ‌రీశ్ రావు | త్రినేత్ర News