Harish Rao | రేవంత్‌వి పిట్టకథలు… ఉత్తమ్‌వి కట్టుకథలు
మన రాష్ట్రానికి మేలు కోసమే పాలమూరు ప్రాజెక్టు కట్టాం. రెండేళ్ల నుంచి ప్యాకేజీ 3 లో బుడ్డ కాల్వ పూర్తి చేస్తే ఈ ఏడాది 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉన్నా.. దాన్ని కాలరాశారు. పాలమూరుపై రేవంత్ పగబట్టారు.
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డివి పిట్టకథలు అయితే.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డివి కట్టుకథలు అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్సే అని ఆయన స్పష్టం చేశారు. నదీ జలాలు - కాంగ్రెస్ ద్రోహాలు అంశంపై తెలంగాణ భవన్‌లో ఆదివారం, జనవరి 4, 2026న హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫజల్ అలీ కమిషన్ వద్దనా.. ఆంధ్రాలో కలిపి తెలంగాణకు ద్రోహం చేశారన్నారు. పాలమూరుకు మరణశాసనం రాసిందే కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్.. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకున్నారన్నారు.

తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్
తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని 11 వ షెడ్యూల్‌లో పాలమూరు- రంగారెడ్డి పెట్టలేదన్నారు. విభజన సమయంలోనూ మనకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెండేళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెబుదామంటారని మొదటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ చెబుతున్న మాటలు నేడు అక్షర సత్యం అయ్యాయన్నారు. కృష్ణా నదీజలాల్లో అతి తక్కువ వినియోగం చేస్తారని, గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయికారి ఒప్పందం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కావాలని కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారని.. కాళేశ్వరంపై కక్షగట్టి.. పాలమూరుపై పగబట్టారన్నారు.

రెండేళ్లలో కాళేశ్వరంపై 2 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు
నిపుణుల సహకారంతోనే పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు కేసీఆర్ రూపకల్పన చేశారు. రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరాన్నే పండబెట్టారు. రూ.100 - 200 కోట్లు ఖర్చు పెడితే 5 నుంచి 6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. రెండేళ్లలో రేవంత్ సర్కారు 2 రూపాయలు కూడా కాళేశ్వరంపై ఖర్చు పెట్టలేదు. రైతాంగం, ఉత్తర తెలంగాణపై పగబట్టి ఇలా చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ లేకపోయిన నదీప్రవాహం నుంచి, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను నడిపి నీళ్లు తెచ్చే అవకాశం ఉందన్నారు.

మన రాష్ట్రానికి మేలు కోసమే పాలమూరు ప్రాజెక్టు కట్టాం. రెండేళ్ల నుంచి ప్యాకేజీ 3 లో బుడ్డ కాల్వ పూర్తి చేస్తే ఈ ఏడాది 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉన్నా.. దాన్ని కాలరాశారు. పాలమూరుపై రేవంత్ పగబట్టారు. పాలమూరుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్, టీడీపీ ద్రోహం చేస్తే.. రేవంత్ ఆ ద్రోహాల పరంపరను కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 42 లక్షల ఆయకట్టు మాత్రమే ఉండేది. పదేళ్లలో 5 లక్షల 71 వేల ఆయకట్టు కాంగ్రెస్ తెస్తే.. పదేళ్ల కాలంలో మేము కొత్తగా 17 లక్షల ఆయకట్టు తెచ్చాం. ఎస్ఆర్ఎస్‌పీ స్టేజ్ 2 కి కాళేశ్వరం నీళ్లు అందించాం. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Harish Rao | తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా: హరీశ్ రావు
మే 21, 2026
తాజావార్తలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్



