త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఢిల్లీలో హరీశ్ రావు.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదితో భేటీ

కాళేశ్వరం కమిషన్‌పై త్వరలో రానున్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలతో పాటు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి కార్యచరణపై సీనియర్ లాయర్ ఆర్యమా సుందరంతో హరీశ్ రావు సుదీర్ఘంగా చర్చించారు.

J

Telangana | Published On Apr 20, 2026, 9.44 pm IST

Harish Rao | ఢిల్లీలో హరీశ్ రావు.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదితో భేటీ
Advertisement

Harish Rao | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ త్రిసభ్య బృందం ఢిల్లీకి వెళ్లింది. మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీకి వెళ్లిన వారిలో ఉన్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరంతో ఈ బృందం భేటీ అయింది. కాళేశ్వరం కమిషన్‌పై త్వరలో రానున్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలతో పాటు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి కార్యచరణపై సీనియర్ లాయర్ ఆర్యమా సుందరంతో హరీశ్ రావు సుదీర్ఘంగా చర్చించారు.

Advertisement
Advertisement