త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | అంగన్‌వాడీల‌ జీతాలు చెల్లించి.. మ‌హిళ‌ల‌పై ఉన్న గౌర‌వాన్ని నిల‌బెట్టుకో : హ‌రీశ్‌రావు

Harish Rao | మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి.. తొలుత అంగ‌న్‌వాడీల‌కు జీతాలు చెల్లించి.. వారిపై ఉన్న గౌర‌వాన్ని నిలుపుకోవాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

P

Telangana | Published On Jun 9, 2026, 3.08 pm IST

Harish Rao | అంగన్‌వాడీల‌ జీతాలు చెల్లించి.. మ‌హిళ‌ల‌పై ఉన్న గౌర‌వాన్ని నిల‌బెట్టుకో : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి.. తొలుత అంగ‌న్‌వాడీల‌కు జీతాలు చెల్లించి.. వారిపై ఉన్న గౌర‌వాన్ని నిలుపుకోవాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62వేల అంగన్‌వాడీల కష్టాలు మీకు కనిపించడం లేదా? అంటూ ప్ర‌శ్నించారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్‌వాడీల‌ను వేధిస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి త‌ప్ప‌కుండా వారి ఉసురు త‌గులుతుంద‌న్నారు.

వేత‌నాలు, గౌర‌వాన్ని పెంచాం..

మ‌హిళా మంత్రిగా ఉన్న సీతక్క సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచ‌నీయ‌మ‌న్నారు. అంగన్‌వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ వర్కర్లు కాదని, అంగన్‌వాడీ టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించి వారి గౌర‌వాన్ని పెంచార‌న్నారు. 2014 నాటికి కేవలం రూ.4,200, సహాయకులకు రూ.2,200 వేతనం ల‌భించేద‌ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంగ‌న్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్ వాడీ టీచర్ల వేతనాన్నిరూ.7,800కు, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800కు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించార‌ని తెలిపారు. అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని 18,000కు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్ర‌క‌టించార‌ని.. మాయ మాటలు చెప్పి, రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీగ‌తి లేద‌ని విమ‌ర్శించారు.

అర‌చేతిలో వైకుంఠం

ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేసుకుంటం అన్నట్లుంది కాంగ్రెస్ వైఖ‌రి అంటూ విమ‌ర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రెటేరియట్ పిలుపునిచ్చిన అంగన్‌వాడీల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిద‌ని మండిప‌డ్డారు. ఇప్పటికైనా కళ్లు తెర‌వాల‌ని.. పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించాల‌న్నారు. రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని, అప్‌గ్రేడ్ చేసిన మినీ అంగన్‌వాడీలకు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న పెంచిన వేత‌నాల‌ను సైతం త‌క్ష‌ణం చెల్లించాల‌ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement