త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha | నేను ఏ త‌ప్పు చేయ‌లేదు.. త‌లెత్తుకుని బ‌తుకుతా.. ఎమ్మెల్యేగా కొన‌సాగుతా

Konda Surekha | మంత్రిగా, ఎమ్మెల్యేగా నేను ఏ త‌ప్పు చేయ‌లేదు.. కాబ‌ట్టి త‌లెత్తుకుని బ‌తుకుతా.. త‌ప్పు చేసి బ‌ర్త‌ర‌ఫ్ చేస్తే త‌ల దించుకోవాలి.. త‌ప్పే చేయ‌న‌ప్పుడు త‌ల ఎందుకు దించుకోవాలి అని వ‌రంగ‌ల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఉద్దేశం లేద‌ని, ఎమ్మెల్యే కొన‌సాగుతూ ప్ర‌జా సేవ‌కు అంకిత‌మ‌వుతాన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Sep 3, 2026, 5.26 pm IST

Konda Surekha | నేను ఏ త‌ప్పు చేయ‌లేదు.. త‌లెత్తుకుని బ‌తుకుతా.. ఎమ్మెల్యేగా కొన‌సాగుతా
Advertisement

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయ‌ను
ఎమ్మెల్యేగా కొన‌సాగుతా
ప్ర‌జల‌కు సేవ‌లందిస్తా
కానీ బ‌ర్త‌రఫ్ చేయ‌డం బాధాక‌రం
ఉరిశిక్ష వేసే ఖైదీనైనా..
చివ‌రి కోరిక ఏంట‌ని అడుగుతారు
నేనేం త‌ప్పు చేశాన‌ని బ‌ర్త‌ర‌ఫ్ చేశారు
మోనోపాలి మాదిరి సీఎం వ్య‌వ‌హ‌రించొద్దు
మీడియాతో కొండా సురేఖ‌

Konda Surekha | త్రినేత్ర‌.న్యూస్ : మంత్రిగా, ఎమ్మెల్యేగా నేను ఏ త‌ప్పు చేయ‌లేదు.. కాబ‌ట్టి త‌లెత్తుకుని బ‌తుకుతా.. త‌ప్పు చేసి బ‌ర్త‌ర‌ఫ్ చేస్తే త‌ల దించుకోవాలి.. త‌ప్పే చేయ‌న‌ప్పుడు త‌ల ఎందుకు దించుకోవాలి అని వ‌రంగ‌ల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఉద్దేశం లేద‌ని, ఎమ్మెల్యే కొన‌సాగుతూ ప్ర‌జా సేవ‌కు అంకిత‌మ‌వుతాన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. అయితే త‌న నుంచి ఎలాంటి వివ‌ర‌ణ కోర‌కుండా కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం బాధాక‌రం.. సీఎం రేవంత్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి త‌న బ‌ర్త‌ర‌ఫ్ చేశార‌ని కొండా సురేఖ పేర్కొన్నారు. ఆమె బ‌ర్త‌ర‌ఫ్ అంశంపై హైద‌రాబాద్‌లో గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

త‌న‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేశాక.. బీసీ మ‌హిళ‌ల‌కు నా వ‌ల్ల ప‌ద‌వులు రావ‌డం సంతోషంగా ఉంది. మున్నూరు కాపు, ప‌ద్మ‌శాలి కులాల‌కు చెందిన మ‌హిళ‌ల‌కు ప‌ద‌వులిచ్చి బ్యాలెన్స్ చేశారు. రెండు రోజుల పాటు నేను ఢిల్లీలో ఉన్నాను.. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్, కేసీ వేణుగోపాల్, మీనాక్షి న‌ట‌రాజ‌న్‌, మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న‌కానీ న‌న్ను కూర్బోబెట్టి మాట్లాడ‌లేదు. ఒక్క మాట కూడా అడ‌గ‌లేదు. ఉరిశిక్ష వేసిన ఖైదీని అయినా కూడా నీ చివ‌రి కోరిక ఏంట‌ని అడుగుతారు. క‌నీసం న‌న్ను ఒక మాట అడ‌గాల్సి ఉండే. మీరు రాజీనామా చేయాలి అని. నేను ఎందుకు రాజీనామా చేయాల‌ని అడిగే అవ‌కాశం ఉండేది. నేను ఏం త‌ప్పు చేయ‌క‌పోయినా.. నా వివ‌ర‌ణ తీసుకునేందుకు అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఈ రోజు ఏ కార‌ణం చేత బ‌ర్త‌ర‌ఫ్ చేస్తున్నారో వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. ఇది చాలా బాధాక‌రం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. హైక‌మాండ్‌కు త‌న్ను తొల‌గించే ఉద్దేశం లేదు. ఇది 100 శాతం నాకు తెలుసు. కానీ సీఎం ప‌ట్టుబ‌ట్టి మీరు తొల‌గిస్తారా.. న‌న్ను వెళ్లిపోమంటారా..? అనే బ్లాక్ మెయిల్ రాజ‌కీయం చేసి న‌న్ను బ‌ర్త‌ర‌ఫ్ చేశారు.. కావాల‌ని క‌క్ష గ‌ట్టి బ‌య‌ట‌కు పంపించారు అని కొండా సురేఖ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ విధంగా ఇబ్బంది పెట్ట‌డం చ‌రిత్ర‌లో ఎక్క‌డా లేకుండొచ్చు.

సుమంత్ కుటుంబాన్ని వేధించారు. ఈ కేసులో వ‌సూలు చేసిన వాడే కేసు పెట్టిండు.. కిర‌ణ్ సీఎం వ‌ద్ద ఉన్న వ్య‌క్తి డ‌బ్బులు వ‌సూలు చేశారు. హ‌రికృష్ణ‌ను పోలీసుల‌కు అప్ప‌జెప్పారు. ప్రెస్‌కు పెడితే ప్ర‌భుత్వం ఇబ్బంది పడుత‌ది.. అని సీపీ స‌జ్జ‌న‌ర్ చెప్పారు. అత‌నికి 24 గంట‌ల త‌ర్వాత బెయిల్ ఇచ్చారు. 15 రోజుల త‌ర్వాత వాన్ని తీసుకొచ్చి పిటిష‌న్ పెట్టించి, మ‌ర్డ‌ర్ అటెంప్టు పెట్టించి.. సుమంత్‌ను లోప‌లికి పంపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మా ప్ర‌భుత్వంలో మేం ఉన్నాక ఈ విధంగా ఇబ్బంది పెట్ట‌డం చ‌రిత్ర‌లో ఎక్క‌డా లేకుండొచ్చు. ఇది మొద‌టిసారి. సుమంత్‌ను ఇబ్బంది పెట్టొద్ద‌ని హోం డిపార్ట్‌మెంట్‌ను కోరుతున్నాని కొండా సురేఖ తెలిపారు.

సీఎంను కానీ, పార్టీని కానీ ఒక్క‌మాట కూడా అన‌లేదు

సీఎంను కానీ, పార్టీని కానీ ఒక్క‌మాట కూడా అన‌లేదు. నాకు షోకాజ్ ఇస్తే, స‌మాధానం చెబితే సంతృప్తి చెంద‌క నాపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. మ‌ల్లు ర‌వి కూడా కాంగ్రెస్‌ను తిట్టిన‌వారే. రోశ‌య్య అనేవాడు ఇందిరా గాంధీని వెధ‌వ రాజ్యమేలుతుంద‌ని తిట్టిన వ్య‌క్తి. జైపాల్ రెడ్డి ఇందిరా గాంధీని పార్ల‌మెంట్‌లో తిట్టారు. చాలా మంది పోజిష‌న్ల‌లో ఉండి ఇందిరా గాంధీని తిట్టారు. మా కూతురు ఏదో అంటే నామీద క‌క్ష తీసుకోవ‌డం బాధాక‌రం అని సురేఖ అన్నారు.

మా ఆయ‌న మున్నూరుకాపు, నేను ప‌ద్మ‌శాలి

పార్టీ నాయ‌క‌త్వంపై చాలా మంది మాట్లాడితే చ‌ర్య‌లు తీసుకోలేదు. 50 కోట్లు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కున్నార‌ని నీ మీద ఆరోప‌ణ‌లు చేస్తే కూడా మీరు చైర్మ‌న్ ప‌ద‌వులిచ్చి స‌న్మానించిన సంద‌ర్భాలు ఉన్నాయి. న‌న్ను తీసేసినందుకు నేను బాధ‌ప‌డ‌టం లేదు. కార‌ణం చెప్ప‌కుండా తొల‌గించ‌డం బాధాక‌రం.. తీవ్రంగా ఖండిస్తున్నా.. నేను ఒక బీసీ మ‌హిళ‌ను. మా ఆయ‌న మున్నూరుకాపు, నేను ప‌ద్మ‌శాలి అని ఆమె తెలిపారు.

ఆయ‌న‌కు ఆయ‌న భార్య కూడా ఓటేయ‌ని ప‌రిస్థితి

ఎవ‌రి అండ‌లేకుండా ప్ర‌జ‌ల్లో నుంచి పైకి వ‌చ్చాం. ఇదే రేవంత్ మా ఇంటికొచ్చి అన్న వ‌రంగ‌ల్ తిర‌గాలి గెలిపించాలి అన్న‌ప్పుడు కొండా ముర‌ళి తిరిగి వ‌రంగ‌ల్‌లో 11 సీట్లు గెలిపించారు. కాళ్లు మొక్కి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లోకి తీసుకెళ్లి మాతో మీటింగ్‌లు పెట్టించుకున్న వారు కూడా ఇవాళ మాట్లాడ‌తున్నారు. మా నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్సీగా ఉన్న ఒకాయ‌న ఇవాళ హీరోలాగా మాట్లాడుతున్నారు.. ఆయ‌న‌కు ఆయ‌న భార్య కూడా ఓటేయ‌ని ప‌రిస్థితి అని సురేఖ విమ‌ర్శించారు.

కార‌ణం చెప్ప‌కుండా తీసేయ‌డం జీర్ణించుకోలేక‌పోతున్నాను

ప్ర‌జా బ‌లం ఉన్న నాయ‌కులం మేం. ప్ర‌జ‌లు మా వెంటే ఉంటారు. ఈ రోజు మంత్రి ప‌ద‌వి ఆభ‌ర‌ణం మాత్ర‌మే. గ‌తంలో నా చేతుల‌తో మంత్రి ప‌ద‌వికి రిజైన్ చేశాను. ఇవాళ మంత్రి ప‌ద‌వి పోతే బాధ లేదు. కార‌ణం చెప్ప‌కుండా తీసేయ‌డం జీర్ణించుకోలేక‌పోతున్నాను. ఎందుకు బ‌ర్త‌ర‌ఫ్ చేశారో చెప్పాల్సిన బాధ్య‌త ఏఐసీసీ, సీఎంపై ఉంది అని కొండా అన్నారు.

రేపు మీకు కూడా నాలాంటి స‌మ‌స్య‌నే

మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారా.. లేర‌నే విష‌యం మీకు కూడా తెలుసు. గుండెల మీద చేయి వేసుకోని ఆలోచించండి. రేపు మీకు కూడా నాలాంటి స‌మ‌స్య‌నే వ‌చ్చే అవ‌కాశం ఉంది.. బాధ‌ను బ‌య‌ట‌కు చెప్పుకోండి. ప్ర‌జా పాల‌న‌లో ప‌డుతున్న బాధ‌లు మీకు తెలుసు.. బ‌య‌ట‌కు చెప్పండి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు సూచించారు.

హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త

మీకు స‌మ‌యం దొర‌క‌దు.. స‌మ‌యం తొరికితే పిటిష‌న్ తీసుకోరు.. పిటిష‌న్ తీసుకుంటే సంత‌కం పెట్ట‌రు. సంత‌కం పెడితే ప‌ని కాదు.. ఆ త‌ర్వాత అదేటు పోత‌దో తెల్వ‌ది. అలాంటి ప‌రిస్థితిలో ఈ ప్ర‌భుత్వం ఉంది. ప్ర‌భుత్వం స్టీమ్ లైన్ చేయ‌క‌పోతే ఇబ్బందుల‌కు గుర‌వుతుంది. హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తుంది. ఇచ్చిన హామీల‌ను వెంట‌నే అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచ‌న చేస్తున్నాన‌ని సురేఖ తెలిపారు.

ఆ అభిప్రాయంగా తీసుకుని నా బిడ్డ మాట్లాడితే

నా కూతురి ఏదో కామెంట్ చేసింది. రాహుల్ గాంధీ మ‌నుస్మృతి అంటున్న‌రు. మ‌హిళ‌లు ఎవ‌రికి వారు మాట్లాడాలి. తండ్రులు, అన్న‌లు మీద ఆధార‌ప‌డోద్దు.. ఆ అభిప్రాయంగా తీసుకుని నా బిడ్డ మాట్లాడితే దాన్ని నా మీద రుద్ది తొల‌గించ‌డం బాధాక‌రం అని ఆమె పేర్కొన్నారు.

ఆయ‌న‌కు ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించుకోవ‌డం స‌రికాదు

నేను మొద‌ట బీసీ రిజ‌ర్వేష‌న్ చేశాన‌ని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. బీసీనైనా న‌న్ను తొల‌గించ‌డం రాజ‌కీయాల్లో ప్ర‌భావితం అవుతుంది. ప్ర‌భుత్వం గ‌ట్టెక్కాలంటే చాలా నిర్ణ‌యాలు తీసుకోవాలి. మోనోపాలి మాదిరి ముందుకు పోవ‌డం మంచిది కాదు. ఆయ‌న‌కు ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించుకోవ‌డం స‌రికాదు. ఆయ‌న ఎమ్మెల్యే క్యాండిడేట్‌ను డిక్లేర్ చేయ‌డం స‌రికాదు. ఇక‌ముందైనా నిర్ణ‌యం తీసుకునేట‌ప్పుడు ఒక‌టికి నాలుగుసార్లు ఆలోచించి పార్టీకి మ‌చ్చ లేకుండా ముందుకు పోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ సూచించారు.

Advertisement
Advertisement