Harish Rao | సాగర్ జలాలను ఏపీ తరలించే కుట్రలు చేస్తుంటే రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తోంది?: హరీశ్ రావు
Harish Rao | నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) మొద్దు నిద్ర పోతున్నదని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ జలాలను (Nagarjuna Sagar) ఏపీ తరలించే కుట్రలు చేస్తుంటే రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తున్నదని మండిపడ్డారు.
Harish Rao | త్రినేత్ర న్యూస్: నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) మొద్దు నిద్ర పోతున్నదని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ జలాలను (Nagarjuna Sagar) ఏపీ తరలించే కుట్రలు చేస్తుంటే రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తున్నదని మండిపడ్డారు. సొంత జిల్లాకే అన్యాయం జరుగుతుంటే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏపీ తీసుకుపోతే, సాగర్ ఖాళీ అయితే నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరు దొరకదని చెప్పారు. ప్రజలు వలస పోయే పరిస్థితి వస్తుందన్నారు. హైదరాబాద్‌కు (Hyderabad) తాగునీటి సరఫరాలో ప్రధాన ఆధారమైన నాగార్జున సాగర్‌కే పొక్క గొడితే ప్రజలు ఏం కావాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ నిర్వాకం వల్లనే, కాంగ్రెస్ ఎడ్డితనం, గుడ్డితనం వల్లనే నేడు శ్రీశైలం తెలంగాణ చేతిలో లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. `కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా అయింది. నాగార్జున సాగర్ కుడి వైపు ఏపీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంటే, ప్రభుత్వ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని చెప్పి అక్కడున్న ఈఈ, ఈసీపై తాను ఆగ్రహం వ్యక్తి చేశానని, నువ్వు ఆంధ్ర అతనివి కాబట్టే మాకు చెప్పలేదా? అని అతనిపై కోపానికి వచ్చానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పిండ్రు. అంటే పరోక్షంగా ప్రభుత్వ తప్పిదాన్ని ఒప్పుకొని చెంపలేసుకున్నాడు.
సొంత జిల్లాకే అన్యాయం చేస్తున్నడు..
2026, ఆగస్టు 4న జీవో వచ్చినప్పటికీ నీళ్ల మంత్రి అయిన ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డికి (Uttam Kumar Reddy) తెలియకుండా ఉంది? జీవో రాకముందు కూడా అక్కడ సర్వే పనులు జరుగుతా ఉన్నాయి. ఒక సంవత్సర కాలం నుంచి సర్వే, మొబిలైజేషన్ పనులు జరుగుతుంటే ఏడాది కాలంగా నీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందా?. నీ జిల్లాకే అన్యాయం జరుగుతూ, మొత్తం నాగార్జునసాగర్‌కు పొక్కగొట్టి రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకుపోయేటువంటి కుట్ర జరిగింది. మంచి నీళ్లకు రెండు టీఎంసీలు అవసరమా? రోజుకు రెండు టీఎంసీల చొప్పున రెండు నెలలు పోతే ఎన్ని పోతాయి? దాదాపు 120 టీఎంసీలు పోతాయి. మరి రెండు టీఎంసీలు ఎందుకు?. మీరనేది 8 టీఎంసీలు, 9 టీఎంసీలు తీసుకుపోయేదే నిజమైతే 2 టీఎంసీల వ్యాసంతో టన్నెల్ ఎందుకు తవ్వుతా ఉన్నారు?. రేపు రోజుకు రెండు టీఎంసీలు తీసుకుపోతే.. సాగర్ ఖాళీ అయిపోతే.. నల్లగొండ జిల్లాకు తాగునీరు, సాగునీరు దొరకదు. హైదరాబాద్ (Hyderabad) ప్రజలు వలసపోయే పరిస్థితి వస్తది. హైదరాబాద్‌కు నీళ్లు తాగునీరు రావడంలో ప్రధాన ఆధారం నాగార్జునసాగర్. రేపు ఆ సాగర్‌కే పొక్కగొడితే ఇంకేం కావాలి?.
ఈ కాంగ్రెస్ నిర్వాకం, ఎడ్డితనం, గుడ్డితనం వల్లనే ఇవాళ శ్రీశైలం మన చేతుల్లో లేకుండా పోయింది. అటు పోతిరెడ్డిపాడు, వెలిగొండ కావచ్చు.. ఇవాళ అనేక ప్రాజెక్టులు శ్రీశైలం మీద పెట్టి ఇవాళ శ్రీశైలంలో మన వాటా మనకు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఉన్న నాగార్జునసాగర్‌ను కూడా ప్రస్తుత కాంగ్రెస్, ఈ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల వైఫల్యం వల్ల ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అంటే మీ పరిస్థితి ఎట్లుందంటే ముల్లుకర్ర వట్టి పొడుస్తే తప్ప నిద్ర లేవడం లేదు. కుంభకర్ణుడి లాగా మొద్దు నిద్ర పోతున్నది. కమీషన్ల మీద ధ్యాస తప్ప రాష్ట్రం మీద, రాష్ట్ర నీటి హక్కుల మీద మీకు సోయే లేదు.
కుమ్మక్కు రాజకీయాలు..
ఆనాడు గోదావరి బనకచర్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టి, పోరాడితే బ్యాక్ డేట్‌లో ఉత్తరాలు రాసిండ్రు. ఇవ్వాళ కూడా నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంది. రెండు టీఎంసీలు రోజుకు తీసుకుపోతుందని బీఆర్ఎస్ పార్టీ, కొన్ని పత్రికలు బయట పెడితే అప్పుడు పాత తేదీలతో ఉత్తరం రాశారు. మరి ఇన్ని రోజులు ఏం చేసినావు?. నీ జిల్లా, నువ్వు నీళ్ల మంత్రివి. నీ నల్లగొండకే అన్యాయం జరుగుతా ఉంటే, నల్లగొండ సాగునీరు, తాగునీటినే ఆంధ్రప్రదేశ్ దోచుకుంటుంటే ఎందుకు మొద్దు నిద్ర పోతున్నారు?. ఎందుకు ఆంధ్రప్రదేశ్ తో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారు?. మీ కుర్చీల కోసమో, మీ అధికారం కోసమో ఇవాళ చంద్రబాబు నాయుడుకు (Chandra Babu Naidu) దాసోహం అయిపోయి కృష్ణా నదీ జలాల వాడకంలో ఈ రాష్ట్రం పూర్తిగా విఫలమైపోయింది.
ఒక్కసారీ పూర్తి వాటా వాడలే..
కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో మేము ఏ రోజు కూడా రాష్ట్ర వాటా కంటే ఎక్కువే తీసుకున్నాం. 34 శాతం అనేది తాత్కాలిక వాటా. శాశ్వతంగా ఆరేడు వందల టీఎంసీలు రావాలని కృష్ణా ట్రిబ్యునల్‌ను కేసీఆర్ సాధించారు. నువ్వేం చేస్తున్నావ్? మూడేండ్ల నుంచి ఆ ట్రిబ్యునల్ అవార్డు రాబట్టవా?. ఆ ట్రిబ్యునల్ వస్తే ఆరు వందలు, ఏడు వందలు టీఎంసీలు వస్తాయి కదా. కేసీఆర్ మాకు ఈ 34 శాతం తాత్కాలిక వాటా సరిపోదని, కృష్ణా నదీ జలాలు పునఃపంపిణీ చేయాలని, తెలంగాణకు ఆరేడు వందల టీఎంసీలు కావాలని సుప్రీంకోర్టుకు పోయి.. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆరోజు కృష్ణా ట్రిబ్యునల్ సాధించారు. మూడేండ్లయినా బలమైన వాదనలు వినిపించడంలో మీరు విఫలమయ్యారు. తెలంగాణ నీటి హక్కులు కాపాడడంలో విఫలమయ్యారు. ఆరోజున్న తాత్కాలిక వాటాలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ సంవత్సరం 45, ఓ సంవత్సరం 30శాతం, 35 శాతం, 29 శాతం నీళ్లు వాడుకున్నాం. కానీ కాంగ్రెస్ వచ్చిన ఈ మూడేళ్లలో 2024-25లో వాడింది 28 శాతం 28 శాతం. 2025-26లో మీరు వాడింది 25 శాతం. ఆ రకంగా ఏ సంవత్సరం కూడా తాత్కాలిక వాటాను కూడా వినియోగించడంలో మీరు విఫలమయ్యారు.
ఆయనది అజ్ఞానం..
పీసీసీ అధ్యక్షుడు అవగాహన రహిత్యంతో మాట్లాడున్నారు. ఆయన అజ్ఞానానికి చింతిస్తున్నా. 34 శాతానికి బీఆర్ఎస్ (BRS) ఒప్పుకుంటే కృష్ణా ట్రిబ్యునల్‌ను ఎందుకు సాధిస్తుంది? కృష్ణా నదీ జలాలను రెండు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేయాలనీ ఎందుకు అడుగుతుంది?. తెలంగాణకు ఆరేడు వందల టీఎంసీలు రావాలని ట్రిబ్యునల్‌ను సాధించి, అఫిడవిట్ వేసింది బీఆర్ఎస్. ఆ ట్రిబ్యునల్ 2023లో మేము సాధిస్తే ఇవాళ 2026. మీ ప్రభుత్వం వచ్చి మూడేండ్లు అయినా ఆ ట్రిబ్యునల్ (Krishna Tribunal) ముందు బలమైన వాదనలు వినిపించి నీటి వాటా సాధించడంలో విఫలమయ్యారు. పీసీసీ అధ్యక్షుడికి తెలవంది ఏందంటే.. పాలమూరు జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల పేరే మర్చిపోయి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కాంగ్రెస్ పార్టీ.
కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 35 ఏండ్లు పెండింగ్‌లో పెట్టి వలసల జిల్లాగా మారిస్తే.. ఆ ప్రాజెక్టుల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క పాలమూరు జిల్లాకే 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చింది. పాపం ఆయన ఎస్ఎల్‌బీసీ (SLBC) గురించి కూడా మాట్లాడిండు. ఎస్ఎల్‌బీసీని పదేండ్లు పండబెట్టింది కాంగ్రెస్. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 కిలోమీటర్లు తవ్వినాం. సొరంగం పనులను ముందుకు తీసుకుపోయాం. మీరు వచ్చినంక 8 మంది ప్రాణాలు పోతే కనీసం శవాలను కూడా బయటకు తేని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్. ఇవాళ మేమేందో చేస్తున్నామంటున్నారు. మూడున్నర సంవత్సరాలు మీరు చేసిందేన్ని కిలోమీటర్లో చెప్పండి. ఆనాడు మీరు మూలకు పడేసిన ఎస్ఎల్‌బీసీని ముందుకు తెచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు తవ్వింది. మీరు మూడున్నరేండ్లలో ఒక కిలోమీటరు కూడా తవ్వలే. ఇంక మేమేందో చేసినామని మాట్లాడుతున్నావ్. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత సాగునీటి రంగంలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా వెనకకు నెట్టింది కాంగ్రెస్. నీళ్లు ఉండి నీళ్లు ఎత్తని ప్రభుత్వం కాంగ్రెస్.
కాంగ్రెస్ తెచ్చిన కరువు..
ఇవాళ కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ (Congress party) తెచ్చిన కరువు. గోదావరిలో దేవాదుల దగ్గర 24 గంటలు వరద ఉంది. రోజుకు 8 గంటలే నీళ్లు ఎత్తిండ్రు. నీళ్లు ఉన్నా ఎత్తకుండా.. ఇవాళ లేని కరువును తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దింది కాంగ్రెస్. సీతారామలో నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నా, రోజుకు 8 గంటలే నీళ్లు ఎత్తి లేని కరువును ఖమ్మం జిల్లా నెత్తిన రుద్దింది కాంగ్రెస్. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 120 రోజులు నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నా, రోజుకు 8 గంటలే మోటార్లు నడిపి, 5 మోటార్లు ఉంటే 3 మోటార్లే నడిపి, 70 టీఎంసీలు ఎత్తగలిగే అవకాశం ఉంటే 20 టీఎంసీలే ఎత్తి పాలమూరు ప్రజల మీద కరువును రుద్దింది కాంగ్రెస్. ఇంకా మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చెప్తే ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో మీకే తెలవదు.
మీరు వచ్చినంక ఒక్క ప్రాజెక్ట్ పూర్తయిందా?. ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చిండ్రా?. అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు? 2024-25లో 6 లక్షల ఎకరాలు, 2025-26లో 6 లక్షల ఎకరాలు, 2026-27లో 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం అన్నారు. మూడేండ్లు అయింది. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇయ్యాలి. పద్దెనిమిది వేల ఎకరాలకైనా ఇచ్చిండ్రా మీ ముఖానికి. 18 లక్షల ఎకరాలకు ఇస్తామని అసెంబ్లీలో బడ్జెట్‌లో ఉపన్యాసాలు దంచారు. ఒక లక్ష ఎకరాలకైనా నీళ్లు ఇచ్చిండ్రా?. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇవాళ ప్రజలను కరువు బారిన పడేసి ప్రజలను గోస పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నీళ్ల విషయంలో తెలంగాణ హక్కులు కాపాడడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు.
డీపీఆర్‌లు వెనక్కి..
మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక డీపీఆర్‌లు వెనక్కి వచ్చినాయి. ఒక్క డీపీఆర్ (DPR) కూడా క్లియర్ చేయించలే. ఇవాళ సీతమ్మ సాగర్ డీపీఆర్ వెనక్కి వచ్చింది. సమ్మక్క సాగర్ డీపార్ వాపస్ వచ్చింది. పాలమూరు ఎత్తిపోతల పథకం, వార్ధ డీపీఆర్ వాపస్ వచ్చింది. మీరు ఒక్క డీపీఆర్‌కు ఒక్క టీఎంసీ అదనపు నీళ్లను కూడా మీరు సాధించలేదు. ఇటు నీళ్లు సాధించలేదు. ప్రాజెక్టులు నిర్మించలేదు. అనుమతులు తేవడంలో కూడా విఫలమయ్యారు. పైగా ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) దాసోహమై కృష్ణా, గోదావరి నదుల్లో వెయ్యి టీఎంసీలను అటు ఆంధ్రప్రదేశ్ సముద్రం పాలు చేసి తెలంగాణను (Telangana) కరువు బారిన పడేసిన చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మొద్దు నిద్రపోయాం. బీఆర్ఎస్, కొన్ని పత్రికలు మమ్మల్ని తట్టి లేపితే నిద్ర లేచి పాత తేదీలో ఉత్తరం రాశామని ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు.` అని హరీశ్ రావు అన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!
- ●Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం
- ●AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!
- ●Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- ●Nagarguna Sagar | నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా

Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం

HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!

Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం

AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!




