త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కృష్ణా నీళ్లు ఏపీ అప్ప‌నంగా త‌ర‌లిస్తుంటే.. సీఎం చోద్యం చూస్తుండు : హ‌రీశ్‌రావు

Harish Rao | కృష్ణా న‌దీ జ‌లాల‌ను ఏపీ అప్ప‌నంగా త‌ర‌లించుకోతుంద‌ని.. జూబ్లీహిల్స్ ప్యాలెస్ కూర్చోని సీఎం రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్న‌డ‌ని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. తాను పూర్తి ఆధారాల‌తోనే మాట్లాడున్నాన‌ని, ఇండెంట్లు, బోర్డు అనుమ‌తులు లేకుండా ఇష్టారాజ్యంగా ఏపీ నీటిని త‌ర‌లించుకుపోతుంద‌ని ఆరోపించారు.

P

Telangana | Published On Feb 10, 2026, 7.44 pm IST

Harish Rao | కృష్ణా నీళ్లు ఏపీ అప్ప‌నంగా త‌ర‌లిస్తుంటే.. సీఎం చోద్యం చూస్తుండు : హ‌రీశ్‌రావు
Advertisement
  • పూర్తి ఆధారాల‌తోనే మాట్లాడుతున్నా
  • ఇప్ప‌టికే ఏపీ 664 టీఎంసీలు వాడుకుంది
  • ఇఎన్సీ రిటైర్ అయిన తర్వాత వారం రోజుల దాకా పోస్టు నింపలేదు.
  • ఈఎన్సీ రిటైర్ అయిన వారం రోజుల దాకా పోస్టు భ‌ర్తీ చేయ‌లేదు
  • చంద్ర‌బాబుకు రేవంత్ గురు దక్షిణ చెల్లిస్తుండు
  • తెలంగాణ ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వా?
  • బీజేపీ, కాంగ్రెస్ క‌లిసి తెలంగాణ‌కు అన్యాయం చేస్తున్న‌య్‌
  • తెలంగాణ రైతుల నోట్లో మ‌ట్టి కొడుతున్న‌రు
  • రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం బీఆర్ఎస్ పోరాటం
  • కేఆర్ఎంబీ ఎదుట ధ‌ర్నా చేస్తాం
  • బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు

Harish Rao | కృష్ణా న‌దీ జ‌లాల‌ను ఏపీ అప్ప‌నంగా త‌ర‌లించుకోతుంద‌ని.. జూబ్లీహిల్స్ ప్యాలెస్ కూర్చోని సీఎం రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్న‌డ‌ని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. తాను పూర్తి ఆధారాల‌తోనే మాట్లాడున్నాన‌ని, ఇండెంట్లు, బోర్డు అనుమ‌తులు లేకుండా ఇష్టారాజ్యంగా ఏపీ నీటిని త‌ర‌లించుకుపోతుంద‌ని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 'తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీకి రాసిన లేఖ ప్ర‌కారం.. 664 టీఎంసీలు అంటే 80శాతం నీళ్లు ఏపీ వాడుకున్నది. ఇంతగా ఏపీ వినియోగిస్తుంటే ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి ఏం చేస్తున్నడు. జనవరి 28 నాడు తాత్కాలిక ఒప్పందం 66:34 ప్రకారం దాటి ఏపీ ఇప్పటికే 664 టీఎంసీలు వాడుకున్నది. ఇంకా రెండు రోజుల్లో ఏపీ వినియోగం వాటా దాటుతుంద‌ని కేఆర్ఎంబీ లేఖ రాసింది. వెంటనే బోర్డు మీటింగ్ పెట్టిండి, ఏపీ నీటి దోపిడిని ఆపండ‌ని ఈఎన్సీ రాసిన లేఖ‌లో ఉంది' అని హ‌రీశ్‌రావు తెలిపారు.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వా..?

'28న ఈఎన్సీ లేఖ రాసిండు. 31 నాడు ఆయ‌న రిటైర్ అయ్యారు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన తర్వాత వారం రోజుల దాకా పోస్టును భ‌ర్తీ చేయ‌లేదు. లెక్కకు మించిన నీళ్లు తీసుకుపోతుంటే మనకు ఈఎన్సీ పోస్టు నింపలేదు. వారం రోజుల తర్వాత మీడియా ప్రశ్నిస్తే పోస్టు నింపింది. బోర్డు మెంబర్ ఆయన. ఎందుకు ఖాళీ పోస్టు పెట్టారు? వాటా కుదరలేదా? మాట కుదరలేదా? వారం రోజులు ఎందుకు ఖాళీగా ఉంది? రాష్ట్ర ప్రయోజనాలు ఈ ప్రభుత్వానికి పట్టదా?' అంటూ హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. 'ఈ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 29 నాటికి ఏపీ 664 టీఎంసీలు వాడుకుంది. టెంపరరీ అగ్రిమెంట్ ప్రకారం ఏపీ 66శాతమే వాడాలి. కానీ, 80శాతం వాడింది. రేవంత్‌ రెడ్డి, నీళ్ల మంత్రి గడ్డి పీకుతున్నడా? చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు.. ఉత్తరాలు రాయడం తప్ప ఏం చేస్తున్నారు' అంటూ ధ్వ‌జ‌మెత్తారు.

గురువుకు భ‌య‌ప‌డుతున్న‌డు..

'ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం అడగడు. గురువు ఉన్నరని రేవంత్‌కు భ‌యం. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం కండ్లు మూసుకు ప్రవర్తిస్తున్నది. వేసవి వస్తున్నది. తెలంగాణకు నీటి అవసరాలు ఉన్న‌య్‌. పంటలకు, పారిశ్రామిక అవసరాలు ఉన్న‌య్‌. తెలంగాణ అవసరాలు పట్టించుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? తాత్కాలికంగా అయినా మనం 34శాతం వినియోగించుకోవాలి. కానీ, వినియోగించుకున్నది 20శాతం వాటా. మన రాష్ట్రానికి 174 టీఎంసీలు వాడుకునేది ఉన్నది. అయినా వినియోగించుకోరు. ఈ రోజుకు కూడా ఏపీ 1.5టీఎంసీల నీళ్లు తీసుకుపోతున్నది. మన పంటలు ఏం కావాలె. మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంటల పరిస్థితి ఏం కావాలి. సర్కారు నడుపుతున్నరా? సర్కస్ నడుపుతున్నరా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ హ‌యాంలోనే త‌క్కువ వాడ‌కం..

'ఇప్పటికే అనేక సార్లు చెప్పినం. కృష్ణా జలాల వినియోగంలో బిఆర్ఎస్ పాలనతో పోల్చితే కాంగ్రెస్ హయాంలో ఎవర్ లోయెస్ట్ వాడుకున్నం అని చెప్పినం. వరుసగా రెండు సంవత్సరాల్లో అతి తక్కువ కృష్ణా జలాలను వినియోగించి రేవంతు రెడ్డి చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లిస్తున్నడు. ఈ ఏడాది 20శాతం దాటలేదు. ముఖ్యమంత్రి వైఫ్యల్యానికి ఇది నిదర్శనం. సీఎం ఈ రాష్ట్రం పాలిట శాపంగా తయారైండు. హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి.. వాటిని కాలరాస్తున్నడు. రేవంత్‌కి పాలన మీద పట్టు లేదు, ప‌ట్టిలేదు. కేఆర్ఎంబీకి లేఖ రాసి మేం చెప్పిన ఏపీ నీటి వినియోగం వాస్తవం అని ఒప్పుకున్నారు. ఏపీ అడ్డగోలుగా నీళ్లు వాడుతున్నది అడ్డుకోమని ఇప్పుడు లేఖ రాశారు. మేం ప్రశ్నించినప్పుడే మీరు నిద్ర లేచి బాధ్యతగా వ్యవహరించి ఉంటే తెలంగాణకు ఇంత నష్టం అవుతుండేనా? నామమాత్రంగా లేఖ రాయడం తప్ప మీరు చేస్తున్నదేం లేదు' అని మండిప‌డ్డారు.

కేఆర్ఎంబీ త‌క్కువ చూపిస్తుంది..

'664 టీఎంసీలు ఏపీ తీసుకుపోయిందని ఈఎన్సీ కేఆర్ఎంబీకి లేఖ రాస్తే.. కేఆర్ఎంబీ రాసిన లేఖలో 555 టీఎంసీలు తీసుకుపోయిందని ప్రస్తావించింది. వంద టీఎంసీలు తక్కువ చేసి కేఆర్ఎంబీ చెబుతున్నది. అంటే అడగాల్సిన రేవంత్ రెడ్డి అడగడు. హక్కులు కాపాడాల్సిన కేఆర్ఎంబీ ఏపీని ప్రశ్నించదు. బీజేపీ ప్రభుత్వం చేతిలో కేఆర్ఎంబీ ఉన్నది. రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేసీఆర్‌పై మీద పడి ఏడ్వడం తప్పితే.. నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు మాట్లాడరు? కేఆర్ఎంబీని ఎందుకు నిలదీయరు' అంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఆర్ఆర్ ట్యాక్స్ ఎక్క‌డ బ‌య‌ట‌కు వ‌స్త‌దోన‌ని మౌనం..

'ఆర్ఆర్ టాక్స్ ఎక్కడ బయటకు వస్తదో.. స్కాంలు ఎక్కడ బయట పడుతవో అని రేవంత్ మౌనంగా ఉంటరు? బీజేపీ కూడా అట్లాగే మౌనంగా ఉంటది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. అడ్డగోలుగా ఏపీకి నీళ్లు తరలిస్తూ తెలంగాణ రైతుల నోళ్లు కొడుతున్నరు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్న బంధం ఏమిటి? రేవంతు, కిషన్ రెడ్డి కలిసి తెలంగాణ గొంతు పిసుకుతారా? చంద్రబాబు, రేవంతు మధ్య ఫెవికాల్ బంధం ఉండొచ్చు. కానీ, రాష్ట్ర హక్కులను ఆంధ్రాకు ఎందుకు రాసిస్తున్నరు' అని ఆరోపించారు.

కేఆర్ఎంబీ ఎదుట ధ‌ర్నా చేస్తాం..

బీజేపీ, కాంగ్రెస్ ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే స్పందించి ఏపీ నీళ్ల తరలింపును అడ్డుకోవాలని, క్యారీ ఫార్వర్డ్ విధానంలో పైనున్న శ్రీశైలంలో నీటిని ఆపి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. త్వరలో కేఆర్ఎంబీ ఆఫీస్ ముట్టడిస్తాం. కేంద్ర మంత్రిని కలుస్తాం. పార్లమెంట్‌లో లేవ‌నెత్తుతాం. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు 16 మంది ఉండి తెలంగాణ హక్కులను కాపాడడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. రాష్ట్ర నీటి హక్కుల కోసం బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది. 19 ప్లేసుల్లో బీఆర్ఎస్ టెలిమెట్రీలు పెడితే మిగతా 9 ప్లేస్లుల్లో పెట్టడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది' అని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు.

Advertisement
Advertisement