త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | హాస్ట‌ల్ విద్యార్థుల‌కు రేవంత్ స‌రైన అన్నం పెట్ట‌డం లేదు: హ‌రీశ్‌రావు

Harish Rao | తెలంగాణ (Telangana) విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రాష్ట్రంలో హాస్ట‌ల్ విద్యార్థుల‌కు స‌రైన అన్నం పెట్ట‌డం లేద‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) విమ‌ర్శించారు. రేవంత్‌ను చెట్టుకు క‌ట్టేసి కొర‌డా దెబ్బ‌లు కొట్టి తొండ‌లు జొర్రించిన త‌క్కువేన‌ని మండిప‌డ్డారు.

A

Telangana | Published On Dec 25, 2025, 4.05 pm IST

Harish Rao | హాస్ట‌ల్ విద్యార్థుల‌కు రేవంత్ స‌రైన అన్నం పెట్ట‌డం లేదు: హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | తెలంగాణ (Telangana) విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రాష్ట్రంలో హాస్ట‌ల్ విద్యార్థుల‌కు స‌రైన అన్నం పెట్ట‌డం లేద‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) విమ‌ర్శించారు. రేవంత్‌ను చెట్టుకు క‌ట్టేసి కొర‌డా దెబ్బ‌లు కొట్టి తొండ‌లు జొర్రించిన త‌క్కువేన‌ని మండిప‌డ్డారు. సిద్దిపేట (Siddipet) పట్టణంలోని నాసర్ పుర ఫిల్టర్ బెడ్ వద్ద గల అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ లో హ‌రీశ్‌రావు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. అనంత‌రం విద్యార్థుల‌కు అందించే గుడ్లు, బియ్యం, ఇత‌ర దినుసుల‌ను ప‌రిశీలించారు. విద్యార్థుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం విద్యార్థుల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పాల‌న‌లో విఫ‌ల‌మ‌వుతున్న రేవంత్ మ‌ళ్లీ గెలుస్తాన‌ని శ‌ప‌థాలు చేస్తున్నాడ‌ని ఎద్దేవా చేశారు. కమిషన్లు కొట్టుడు, చిల్లర మాటలు మాట్లాడడం, పార్టీ లు మారడం, సీట్లు కొనడం రేవంత్‌కు అల‌వాట‌ని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్‌ (KCR) అని గుర్తు చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేద‌ని, అటువంటి కేసీఆర్‌ను ఉద్దేశించి అలా మాట్లాడ‌డం సరికాద‌న్నారు. సీఎంగా ఉండి వీధిరౌడీలాగా మాట్లాడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

హాస్ట‌ల్ విద్యార్థుల సంర‌క్ష‌ణ గాలికి...

గ‌త ప్ర‌భుత్వంలో హాస్ట‌ళ్ల‌కు పాత బియ్యం అంద‌జేశామ‌ని, ప్ర‌స్తుత ప్ర‌భుత్వం స‌న్న‌బియ్యం అంద‌జేస్తున్న‌ప్ప‌టికీ అన్నం మెత్త‌గా ముద్ద‌లుగా అవుతోంద‌ని ఆరోపించారు. పిల్లలు చలితో చాలా ఇబ్బందులలో ఉన్నారని, అందుకే బ్లాంకెట్స్ పంపిణీ చేశామ‌ని చెప్పారు. గ‌త‌ 5నెలల నుంచి విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు చెల్లించ‌డం లేద‌ని, మెస్ బిల్లులు సైతం విడుద‌ల చేయ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

క‌మిష‌న్లు ఇచ్చిన వారికే బిల్లులు...

ప్ర‌జ‌ల‌కు ఉపాధి, ప‌ర్యావ‌ర‌ణ హిత న‌గ‌రాన్ని రూపొందించేందుకు ఫార్మాసిటీని తాము అభివృద్ధి చేస్తే, దానిని ఇప్పుడు పూర్తిగా రేవంత్ రెడ్డి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చివేశార‌ని అన్నారు. పెండింగ్ బిల్లులు గ్రీన్ చానెల్ ద్వారా ఇస్తామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ, ఎవ‌రికీ ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు. 20 శాతం కమిషన్ ఇచ్చే వాళ్లకు మాత్ర‌మే డబ్బులు విడుదల చేస్తున్నారని చెప్పారు. కమిషన్ ఇవ్వని వారికి డబ్బులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. చిల్లర మాటలు మాని పెండింగ్ బిల్లు లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement